మిస్టర్ ఎక్స్‌లో ఆర్య, గౌతమ్‌రామ్‌కార్తీక్, శరత్‌కుమార్, మంజు వారియర్, యూనిట్ సభ్యులు
తమిళసినిమా: ఇంతకుముందు సర్ధార్, లబ్బర్ బంతు వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ప్రిన్‌న్స్ పిక్చర్స్ సంస్థ అధినేత ఎస్.లక్ష్మణన్, మెమరిక్ మూవీస్ అధినేత వినీత్‌జైన్ కలసి నటించిన తాజా చిత్రం మిస్టర్ ఎక్స్. ఆర్య హీరోగా నటించిన ఇందులో కార్తీక్ గౌతమ్‌రామ్‌కార్తీక్, శరత్‌కుమార్, మంజువారియర్ ప్రధా న పాత్రలు పోషించారు. నటి అనగా, అతుల్య రవి, రైసా విల్సన్, సంజనా సింగ్, కాళీ వెంకట్, జయప్రకాష్ ముఖ్యపాత్రలు పోషించారు. ఎఫ్‌ఐఆర్ చిత్రం ఫేమ్ మను ఆనంద్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రానికి దిపు నినన్ థామస్ సంగీతాన్ని, అరుళ్ విన్సెంట్ చాయాగ్రహణం అందించిన మిస్టర్ ఎక్స్ ఈ నెల 17న ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి రానుంది. చిత్ర యూనిట్ గురువారం చైన్నెలోని పలోజో థియేటర్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంజువారియర్ మాట్లాడుతూ స్పై థ్రిల్లర్ కథా చిత్రాలు ఇంతకుముందు చాలా వచ్చాయని, అలాంటి చిత్రంలో తాను నటించ డం తన అదష్టమని అని అన్నారు. ఇది 70 శాతం యాక్షన్ సన్నివేశాలతో కూడిన కథా చిత్రం అని గౌతమ్ రామ్ కార్తీక్ చెప్పారు. ఆర్య మాట్లాడుతూ దర్శకుడు మను ఆనంద్ మిస్టర్ పర్ఫెక్ట్ అని పేర్కొన్నారు. దర్శకుడు మనుఆనంద్ మాట్లాడుతూ ఈచిత్రం ప్రపంచంలో ఏడు చోట్ల జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందించిన కథా చిత్రం అని చెప్పారు. హిందీ చిత్రం ధురంధర్ కూడా వాస్తవ సంఘటనలతో రూపొందినా, ఆ చిత్రాన్ని మిస్టర్‌ఎక్స్‌తో పోల్చరాదని దర్శకుడు చెప్పారు.
హిట్ కాంబోలో ఇరండు వానం
తమిళసినిమా: సినీ రంగంలో హీరోయిన్ల కాలపరిమితి చాలా తక్కువ అనే టాక్ ఉంది. ఒక్క దశాబ్దంపాటు లైమ్‌లైన్‌లో ఉండడమే కష్టం అంటారు. ఇది ఒక రకంగా నిజమే కావచ్చు. చాలా మంది హీరోయిన్లు ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నారు. చాలా కొద్దిమంది హీరోయిన్లు మాత్రమే దశాబ్దాల పాటు తమ హవాను కొనసాగిస్తుంటారు. అలాంటి వారి పట్టికలో తమన్నా పేరు కచ్చితంగా ఉంటుంది. కారణం రెండు దశాబ్దాల కాలాన్ని అధిగమించి ప్రముఖ కథానాయకిగా రాణిస్తున్నారీ బ్యూటీ. 2005లో నటిగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తమన్నా, ఆ తరువాత టాలీవుడ్, కోలీవుడ్‌ల్లో టాప్ హీరోయిన్‌గా ఎదిగారు. మొదట్లో తనదైన మేనందాలతో కుర్రకారును గిలిగింతలు పెట్టినా, ఆ తరువాత తనలోని నటనకు పదును పెట్టి మంచి నటిగానూ పేరు తెచ్చుకున్నారు. ఇక ప్రత్యేక పాటల్లో తమన్నాది అందవేసిన చెయ్యి అని చెప్పకతప్పదు. పాన్ ఇండియా కథానాయకిగా రాణిస్తున్న తమన్నా సినిమా వయసు 21 ఏళ్లు. ఇప్పుటికీ తరగని అందాలతో ఆకట్టుకుంటూనే ఉంటున్నారు. ఒక్క ఐటమ్ సాంగ్‌కు రూ.6 కోట్ల వరకు పారితోషికం పుచ్చుకుంటున్నారంటే ఈ అమ్మడి క్రేజ్ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. దీని గురించి తమన్నా ఇటీవల ఒక వేదికపై గర్వంగా చెప్పారు. నేను చిత్ర రంగప్రవేశం చేసి 21 ఏళ్లు అవుతోంది. ప్రతిసారి మళ్లీ కొత్తగా ప్రారంభిస్తున్నట్లే భావన కలుగుతోంది. దక్షిణాది సినీ ప్రేక్షకులు ఇప్పటికీ నన్ను అభిమానిస్తున్నారు. అదే విధంగా ఇండియాలోని ఇతర భాషా ప్రేక్షకులు అభిమానించడం ఆనందంగా ఉంది. అలాంటి వారి అభిమానానికి తిరిగి నేనేం చేయాలి అని ఆలోచిస్తున్నానని తమన్నా పేర్కొన్నారు.
ఇరండు వానం
ఫస్ట్‌లుక్ పోస్టర్
వారికి ఏమి చేయాలని ఆలోచిస్తున్నా!
తమిళసినిమా: ముండాచు పట్టి, రాక్షసన్ వంటి సూపర్ హిట్ చిత్రాల కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం ఇరండు వానం. హీరో విష్ణువిశాల్, దర్శకుడు రామ్‌కుమార్‌ల కాంబోలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిలిమ్స్ పతాకంపై త్యాగరాజన్ సమర్పణలో సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. ఇందులో మమితబైజు నాయకిగా నటిస్తున్నారు. విష్ణు విశాల్, మమితా బైజు కాంబినేషన్లో రూపొందుతున్న తొలి చిత్రం ఇది. కాగా సక్సెస్‌ఫుల్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రేక్షకుల అంచనాలను పూర్తి చేసేలా ఇరండు వానం ఉంటుందని యూని ట్ సభ్యులు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. బలమైన కథ, ప్రముఖ సాంకేతిక వర్గం చేస్తున్న చిత్రం కావడంతో విడుదలకు ముందే ప్రాధాన్యతను సంతరించుకుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేయగా విశేష స్పందన వస్తోందన్నారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని సమ్మర్ స్పెషల్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ చిత్రానికి దిపునినన్ థామస్ సంగీతాన్ని, దినేష్ కే.బాబు చాయాగ్రహణం అందించారు.


