క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Apr 11 2026 8:34 AM | Updated on Apr 11 2026 8:34 AM

ఎంజీ మేజెస్టర్‌ రికార్డు

సాక్షి, చైన్నె: ఎంజీ మేజెస్టర్‌ కొత్త రికార్డును నమోదు చేసినట్టుగా జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటారు ఇండియా ఎండీ అనురాగ్‌ మెల్హోత్ర తెలిపారు. ఈ రికార్డు గురించి స్థానికంగా శుక్రవారం ప్రకటించారు. భారత దేశంలోనే తొలి ఈ ప్లస్‌ ఎంజీ మేజెస్టర్‌ అత్యంత బరువైన రైలును లాగి గిన్నిస్‌ రికార్డులో చోటు దక్కించుకున్నట్టు తెలిపారు. 406.4 టన్నుల బరువున్న రైలు (లోకోమోటివ్‌ , కోచ్‌లు కలిపి) 300 అడుగుల దూరం వరకు మేజెస్టర్‌ విజయవంతంగా లాగిందని తెలిపారు. ఈప్రయోగాన్ని జమ్ముకశ్మీర్‌లోని కాకాపోరా–అవంతిపోరా రైల్వేస్టేషన్ల మధ్య నిర్వహించామన్నారు. 400 టన్నులు, 100 అడుగుల లక్ష్యాన్ని మేజెస్టర్‌ అధిగమించిందన్నారు.

వినియోగదారుల

రక్షణకు సీసీయూ

సాక్షి, చైన్నె : వినియోగదారుల రక్షణ లక్ష్యంగా కౌంటర్‌ ఫీట్‌ క్రైమ్స్‌ యూనిట్‌(సీసీయూ)ను ప్రారంభించామని అమెజాన్‌ సీసీయూ డైరెక్టర్‌ కెమ్హ్రూ స్మిత్‌ తెలిపారు. ఈ కొత్త యూనిట్‌ గురించి ఆయన స్థానికంగా వివరిస్తూ వినియోగదారులను, బ్రాండ్‌లను నకిలీ వస్తువుల నుంచి రక్షించడానికి ఈ యూనిట్‌ను ఏర్పాటు చేశామన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ–కామర్స్‌ రంగంలో నకిలీ వస్తువుల విక్రయాలను అరికట్టడం , కస్టమర్ల నమ్మకాన్ని కాపాడడం ఈ విభాగం యొక్క ప్రధాన లక్ష్యంగా వివరించారు. అధునాతన టెక్నాలజీ ద్వారా నకిలీ వస్తువులను గుర్తించి, వాటిని వెబ్‌సైట్‌ నుంచి తొలగించడంతో పాటు, నేరగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటుంది. 2030 నాటికి భారతదేశంలో అమెజాన్‌ సుమారు 35 బిలియన్‌ డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు.

ఘనంగా ఎస్‌ఆర్‌ఎం వార్షికోత్సవం

సాక్షి,చైన్నె: ఎస్‌ఆర్‌ఎం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్‌న్స్‌ అండ్‌ టెక్నాలజీ– వడపళని క్యాంపస్‌ 17వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నా రు. కార్యక్రమానికి జోహో కార్పొరేషన్‌ డైరెక్టర్‌,జోహో స్కూల్‌ ఆఫ్‌ లర్నింగ్‌ ప్రెసిడెంట్‌ రాజేంద్రన్‌ దండపాణి హాజరయ్యారు. ఎస్‌ఆర్‌ఎం వడపళని క్యాంపస్‌ డీన్‌ సీవీ జయకుమార్‌ వార్షికోత్సవ నివేదికను సమర్పించి క్యాంపస్‌ సాధించిన పురోగతిని వివరించారు. సంస్థ డైరెక్టర్‌ హరిణి వేడుకలను ప్రారంభించి విద్యతోపాటు పాఠ్యేతర కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనాలని విద్యార్థులకు సూచించారు. రాజేంద్రన్‌ దండపాణి వార్షికోత్సవ ప్రసంగిస్తూ విద్యాపరమైన విజయాలపై దృష్టి పెట్టకుండా, వాస్తవ ప్రపంచ సవాళ్లకు అనుగుణంగా మారడంపై అవగాహన పెంచారు. అనంతరం బహుమతులు, పురస్కారాలు ప్రదానం చేశారు. వైస్‌ ప్రిన్సిపల్‌, డాక్టర్‌ సి.గోమతి పాల్గొన్నారు.

ప్రారంభానికి నోచుకోని డీబీసీ కేంద్రం

– కృష్ణసముద్రం ప్రాంత రైతులు

ఆందోళనకు నిర్ణయం

తిరుత్తణి: డీబీపీ కేంద్రంకు వరి తరలించేందుకు దారి లేకపోవడంతో పది రోజులుగా ప్రారంభంకు నోచుకోక తిరుత్తణి ప్రాంతం రైతులు తీవ్ర ఇబ్బందులు చెందుతున్నారు. తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా 50 ప్రాంతాల్లో ప్రభుత్వ వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతుల నుంచి వరి కొనుగోలు చేస్తున్నారు.అయతే తిరుత్తణి సమీపంలోని కృష్ణసముద్రంలో వరి కొనుగోలు కేంద్రంకు జిల్లా కలెక్టర్‌ ప్రతాప్‌ ఆదశించారు.అయితే రూ. 35 లక్షల వ్యయంతో నిర్మించిన గిడ్డంగికి ట్రాక్టర్లు, లారీలకు దారి లేకపోవడంతో అధికారులు కాలయాపన చేస్తున్నారు. ఎలాంటి దారిలేని ప్రాంతంలో రూ. 35 లక్షలతో ప్రభుత్వ వరి గిడ్డంగి ఎందురు నిర్మించాలని రైతులు ప్రశ్నించారు. పది రోజులుగా కృష్ణసముద్రం, సూర్యనగరం, బుచ్చిరెడ్డిపల్లె, చిరుగుమి, పరిసర ప్రాంతాల్లోని గ్రామీణులు వరిపంట దిగుబడి చేసి వరి కొనుగోలు కేంద్రంకు తరలించేందుకు వీలులేక పంట పొలాల్లో దాదాపు 1000 టన్నుల వరి నిల్వ వుంచినట్లు, వేసవి వర్షాలు కురుస్తున్న క్రమంలో దిగుబడి చేసిన వరి తడిచి నిరుపయోగంగా మారే అవకాశం వున్నందున రైతులు ఆవేదన వ్యక్తం చేసారు. వెంటనే ప్రత్యామ్నాయ మార్గంలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభించక పోతే పోరాటం చేపట్టనున్నట్లు రైతులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement