సాక్షి, చైన్నె: ప్రముఖ టెలికాం దిగ్గజం ‘వి’ (వోడాఫోన్ ఐడియా) చైన్నెలో తన హై–స్పీడ్ 5జీ సేవలకు బుధవారం అధికారికంగా శ్రీకారం చుట్టింది. ఈమేరకు చైన్నెలో జరిగిన తమిళనాడు రీజియన్ బిజినెస్ హెడ్ సాయి వెంకట్రామన్ 5జీ సేవలకు ప్రారంభించారు. అలాగే, చైన్నె సూపర్ కింగ్స్ జట్టుకు స్పాన్సర్ గా వ్యవహరిస్తున్నట్టు ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ, వినియోగదారులకు మెరుగైన ఇంటర్నెట్ అనుభూతిని అందించే లక్ష్యంతో, ఇప్పటికే ఉన్న 50 నగరాలకు అదనంగా.. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా, చైన్నె వంటి మెట్రో నగరాలలో తాజాగా 5జీ సేవ లను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. విస్తరణ ప్రణాళికలో భాగంగా మే నెల తమిళనాడులోని కోయంబత్తూర్, తిరుచ్చి, సేలం, తిరుపూర్, వేలూరు పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కూడా 5జీ సేవలు ప్రారంభం కానున్నాయని వివరించారు. అలాగే, తమిళనాడు వినియోగదారులను ఆకట్టుకునేందు కు, చైన్నె సూపర్ కింగ్స్ జట్టుకు రాబోయే మూడు సీజన్లకు అధికారిక కమ్యూనికేషన్ పార్టనర్‌గా వ్యవహరించనున్నట్లు ప్రకటించారు. తమిళనాడు, పుదుచ్చేరి అంతటా 5జీ నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తున్నామన్నారు. ఇప్పటికే మదురైలో తమ సేవలు అందుబాటు లో ఉండగా, తాజాగా చైన్నెలో ప్రారంభించామన్నారు. అన్‌లిమిటెడ్ డేటా ప్లాన్‌లతో విని యోగ దారులకు సరికొత్త అనుభవాన్ని అందించడానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు.


