చైన్నె: సేవాతత్వం, మహిళా సాధికారత దిశగా బ్రిటన్‌కు చెందిన 35 మంది మహిళా పారిశ్రామికవేత్తలతో శ్రీలెట్స్ గోవా 2026శ్రీ పేరిట ఆటో రిక్షా ర్యాలీ ప్రారంభమైంది. ఇదో సాహస యాత్రంగా చైన్నె నుంచి గోవాకు 10000 కి.మీ దూరం ఆటో రిక్షాలో పయనించే సాహస పయనానికి శ్రీకారం చుట్టారు. ఈ యాత్ర కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా, సామాజిక మార్పు కోసం నిధుల సమీకరణ ప్రధాన లక్ష్యంగా సాగనుంది. మద్రాస్ మిడ్ టౌన్ రౌండ్ టేబుల్ – 42 , లేడీస్ సర్కిల్ – 7, యూకేకు చెందిన శ్రీది సిస్టర్‌హుడ్ గ్రూప్‌శ్రీ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ ర్యాలీ ద్వారా సుమారు రూ. 3 కోట్ల వరకు నిధులను సేకరించడం లక్ష్యంగా నిర్ణయించారు. ఈ నిధులను తమిళనాడులోని వెనుకబడిన ప్రాంతాల్లో మహిళల నైపుణ్యాభివృద్ధి, చిన్నారుల విద్య, మౌలిక సదుపాయాల కల్పన కోసం వినియోగించనున్నారు. లేడీ ఆండాళ్ పాఠశాలలో జరిగిన ఈ ప్రారంభోత్సవ వేడుకలో రౌండ్ టేబుల్ ఏరియా చైర్మన్ తరణ్ కరణ్ గోయల్, ఎంఎంఆర్‌టీ చైర్మన్ సిద్ధార్థ్ శంకర్, లేడీస్ సర్కిల్ ఏరియా చైర్‌పర్సన్ మోనికా ధరిణి, మద్రాస్ మిడ్ టౌన్ లేడీస్ సర్కిల్ 7 చైర్‌పర్సన్ నందితా విక్రమ్ తదితరులు పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.
మార్పు కోసం అడుగులు
ర్యాలీ ప్రారంభం సందర్భంగా సిస్టర్‌హుడ్ గ్రూప్ వ్యవస్థాపకురాలు ఎమ్మా సేల్ మాట్లాడుతూ.. తమ లక్ష్యం కేవలం సాహసయాత్ర మాత్రమే కాదని, మహిళలను సాధికారత వైపు నడిపించడం , పిల్లల భవిష్యత్తు కోసం మెరుగైన వసతులు కల్పించడం. భారతీయ మిత్రులతో కలిసి ఈ మార్పులో భాగస్వాములు కావడం గర్వంగా ఉందని వ్యాఖ్య లు చేశారు. గత ఏడాది నిర్వహించిన ర్యాలీ ద్వారా సేకరించిన నిధులతో ఇప్పటికే మహిళల కోసం ప్రత్యేక నైపుణ్య శిక్షణా కేంద్రం , దివ్యాంగులైన విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతి గదులను నిర్మించినట్లు తెలిపారు. ఈ 1,000 కిలోమీటర్ల ప్రయాణం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గోవాలో ముగియనుంది. మహిళా శక్తికి, అంతర్జాతీయ స్నేహానికి చిహ్నంగా నిలిచే ఈ ర్యాలీకి పలువురు సామాజిక కార్యకర్తలు, ప్రజల నుండి విశేష స్పందన లభించింది.


