సాక్షి, చైన్నె: తమిళనాడులో తొలి శ్రీనెక్ట్స్ –జనరేషన్‌శ్రీ స్మార్ట్ కోక్లియర్ ఇంప్లాంట్ సర్జరీని అపోలో చిల్డ్రన్స్ హాస్పిటల్స్ వైద్యులు నిర్వహించారు. బంగ్లాదేశ్‌కు చెందిన 9 ఏళ్ల బాలుడికి మళ్లీ వినికిడి శక్తిని కల్పించారు. వివరాలు.. చైన్నెలోని అపోలో చిల్డ్రన్స్ హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ వెంకటకార్తికేయన్ బుధవారం శస్త్రచికిత్స విధానం గురించి తెలిపారు. మార్చి 3వ తేదీన ప్రపంచ వినికిడి దినోత్సవం అని గుర్తు చేస్తూ, ఈ సందర్భంగా కొత్త ఈ మైలురాయిని తాము సాధించడం ఆనందంగా ఉందన్నారు.బంగ్లాదేశ్‌కు చెందిన తొమ్మిదేళ్ల బాలుడు పుట్టినప్పటి నుండి రెండు చెవులలో తీవ్రమైన వినికిడి సమస్యతో బాధపడుతూ వచ్చినట్ట తెలిపారు. ఈ కారణంగా మాటలు రాకపోవడం, భాషా అవగాహన లేకపోవడంతో ఆ చిన్నారి ఇబ్బంది పడేవాడన్నారు.. ఈ అత్యాధునిక చికిత్స కోసం ప్రత్యేకంగా చైన్నెకి వచ్చిన ఆ బాలుడికి, తన నేతృత్వంలోని బృందం ఈ శస్త్రచికిత్సను విజయవంతం చేసిందన్నారు. మొట్టమొదటి స్మార్ట్ కోక్లియర్ ఇంప్లాంట్ సిస్టమ్ ద్వారా నెక్సా చిప్‌సెట్‌తో అత్యంత వేగంగా శబ్దాలను విశ్లేషిసించే విధంగా, భవిష్యత్తుకు సిద్ధం చేస్తూ, ఫర్మ్‌వేర్ అప్‌గ్రేడ్‌లకు మద్దతుగా, సాఫ్ట్‌వేర్ పురోగతిని అందుకోవడానికి మళ్లీ సర్జరీ చేయాల్సిన అవసరం లేకుండా ఈ విధానాన్ని తాము విజయవంతం చేశామన్నారు.ఈ స్మార్ట్ టెక్నాలజీ ద్వారా పిల్లల్లో భాషా వికాసం, విద్యా సామర్థ్యం, సామాజిక సంబంధాలు మెరుగుపడతాయన్నారు. కేవలం సర్జరీ మాత్రమే కాకుండా, శస్త్రచికిత్స అనంతర సంరక్షణ , పునరావాసంపై కూడా ప్రత్యేక దృష్టి పెడుతున్నామన్నారు. ఈ సమావేశంలో అపోలో హాస్పిటల్స్ చైన్నె రీజియన్ సీఈఓ డాక్టర్ ఇలంకుమారన్ కలియమూర్తి తదితరులు పాల్గొన్నారు.


