తిరువళ్లూరు: చైన్నెతో సహా ఐదు జిల్లాలకు చెందిన కళాశాల విద్యార్దులకు నిర్వహించే శ్రీమతి మంజుల మునిరత్నం మెమోరియల్ క్రికెట్ ట్రోఫీ పోటీలు కవరపేటలోని ఆర్‌ఎంకే కళాశాల ఆవరణంలో ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల పాటూ జరిగే పోటీల్లో తిరువళ్లూరు, కాంచీపురం, చైన్నె, చెంగల్‌పట్టుతో సహా ఐదు జిల్లాలకు చెందిన 16 కళాశాలలకు చెందిన జట్లు పాల్గోననుండగా నాకౌట్ పద్ధతిలో పోటీలు నిర్వహిస్తున్నారు. పోటీలను ఆర్‌ఎంకే విద్యాసంస్తల డైరెక్టర్ జ్యోతినాయుడు, ప్రిన్సిపల్ మహ్మాద్ జునైత్ తదితరులు టాస్‌వేసి ప్రారంబించారు. పోటీల్లో పాల్గోనే ప్రతి జట్టుకు ట్రోపీతో పాటు సర్టిఫికెట్‌ను అందజేయనున్నారు. కాగా సోమవారం ఉదయం ఆర్‌ఎంకే, సవిత జట్లు మద్య పోటీ జరిగింది. ఈ పోటీల్లో సవిత ఇంజినీరింగ్ కళాశాల జట్టు మూడు వికెట్లు తేడాతో విజయం సాధించింది. రెండవ మ్యాచ్‌లో ఆర్‌ఎండీ కళాశాల శ్రీపెరంబదూరు వెంకటేశ్వర కళాశాల జట్లు మద్య జరిగిన పోటీల్లో శ్రీవెంకటేశ్వర కళాశాల జట్లు 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడవ పోటీల్లో గిండి సిపెట్ కళాశాల, వేళమ్మాల్ ఇంజినీరింగ్ కళాశాల మధ్య జరిగిన పోటీల్లో వేళమ్మాల్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్దులు విజయం సాధించారు. నాలుగవ పోటీల్లో పణిమలర్ ఇంజినీరింగ్ కళాశాల అమృత కళాశాల మద్య జరిగిన పోటీల్లో పణిమలర్ జట్టు విజయం సాధించింది. కాగా విజేతలకు ఆర్‌ఎంకే విద్యాసంస్థల అధినేత ఆర్‌ఎస్ మునిరత్నం, వైస్‌ఛైర్మన్ ఆర్‌ఎం కిషోర్, కార్యదర్శి యలమంచి ప్రధీప్, డీన్ ఎల్వీన్‌చంద్ర, సలహాదారుడు మనోహరన్, ఆర్గనైజింగ్ సెకరెట్రి డాక్టర్ ఏకేఏ వేల తదితరులు సర్టిఫికెట్‌లు, మెమొంటోలు అందజేశారు.


