తమిళసినిమా: దర్శకులు, నిర్మాతలు, సంగీత దర్శకులు ఇలా పలు రంగాలకు చెందిన కళాకారులు కథానాయకుడిగా అవతారమెత్తుతున్న రోజులవి. కాగా ప్రముఖ యువ సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కూడా పలు చిత్రాల ప్రమోషన్ కార్యక్రమాల్లో, పాటల్లో చూస్తున్నాం. తమిళం తెలుగు భాషల్లో భారీ చిత్రాలకు పనిచేస్తూ బిజీగా ఉన్న సంగీత దర్శకుడు ఆయన. ఇంకా చెప్పాలంటే ఈయన నటుడు రజనీకాంత్‌కు ఆస్థాన సంగీత దర్శకుడిగా మారిపోయారు. ఈయన సంగీతం కురక్రారులను ఉర్రూత లూగిస్తోందనే చెప్పాలి. ప్రస్తుతం ఈయన సంగీతాన్ని అందించిన జననాయకన్, తెలుగులో నాని నటిస్తున్న ది ప్యారడైజ్ వంటి చిత్రాలు త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతున్నాయి. అదే విధంగా తాజా లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించనున్న భారీ బడ్జెట్ చిత్రానికి ఈయనే సంగీతాన్ని అందించనున్నారు. కమలహాసన్, రజినీకాంత్ కలిసి నటిస్తున్న కేజీ చిత్రానికి అనిరుధ్ నే సంగీతాన్ని ఇవ్వనున్నారు. కాగా ఈ చిత్ర ప్రమోషన్ సాంగ్‌లో కూడా రజనీకాంత్ ,కమలహాసన్, దర్శకుడు నెల్సన్‌లతో కలిసి అనిరుధ్ నటించారు. ఈ ప్రోమో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీంతో త్వరలో కథానాయకుడిగా నటించే అవకాశం ఉందా ? అని ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న అనిరుధ్‌ను ప్రశ్నించగా తాను ఎప్పటికీ హీరోగా మారే అవకాశం లేదని స్పష్టం చేశారు. తన దృష్టి అంతా సంగీతం పైనేనని పేర్కొన్నారు. గత 15 ఏళ్లగా లభించిన విజయా లు చాలవని, ఇంకా సంగీతంలో సాధించాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు.
రంభ ఈజ్ బ్యాక్


