అధికారులతో సీఎం స్టాలిన్ సమీక్ష
సాక్షి, చైన్నె: ఐకానిక్ పథకాల తీరు తెన్నుల గురించి సీఎం స్టాలిన్ అధికారులతో మంగళవారం సచివాలయంలో చర్చించారు. ఈ సమావేశంలో సీఎస్ మురుగానందంతో పాటూ ముఖ్య సీనియర్ ఐఎఎస్ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బృహత్తరంగా అమలు చేస్తున్న పథకాలను మరింత విస్తృతం చేయడానికి ఇందులోచర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే సంక్రాంతి కానుక కిట్ల పంపిణి దిశగా కసరత్తు చేసినట్టు సమాచారం. ఈసారి సంక్రాంతి కిట్‌తో పాటుగా మూడు వేలు నగదు పంపిణి చేయవచ్చు అన్న చర్చ ఊపందుకుని ఉంది. అలాగే ఉద్యోగులు, ఉపాధ్యాయులు పోరాటాలు సాగిస్తున్న నేపథ్యంలో పాత పెన్షన్ విధానం గురించి కూడా ఈ భేటీలో చర్చ సాగినట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.


