పాహిమాం!
గోవిందనామస్మరణతో మార్మోగిన వైష్ణవక్షేత్రాలు
వైకుంఠ ఏకాదశి సందర్బంగా ఉత్తర ద్వార దర్శనం
భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు
తిరుచ్చి శ్రీరంగంలో బ్రహ్మాండోత్సవం
శ్రీవారి ఆలయంలో విశిష్ట పూజలు
వైకుంఠవాసా..
సాక్షి, చైన్నె: సంస్కృతి, సంప్రదాయాలకే కాదు ఆధ్యాత్మికతకు నెలవుగా తమిళనాడు భాసిల్లుతున్న విషయం తెలిసిందే. ఇక్కడ ప్రసిద్ధి చెందిన అనేక ఆలయాలకు ఒక్కో విశిష్టత ఉంది. ఆ దిశగా 108 వైష్ణవ దివ్యక్షేత్రాల్లో మొదటిగా భూలోక వైకుంఠంగా కీర్తిగాంచిన తిరుచ్చి శ్రీరంగం శ్రీరంగనాథుని ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలను భక్తిప్రపత్తులతో నిర్వహిస్తూ వస్తున్నారు. ఆధ్యాత్మికతకు నిలయంగా ఉన్న ఈ ఆలయం అతి పెద్ద ప్రాకారంతో, దేదీప్యమానంగా, గాంభీర్యంగా కనిపిస్తుంటుంది. ఏడు ప్రాకారాలు, 21 గోపురాలు , 50 సన్నిధులతో కొలువుదీరిన శ్రీరంగనాథ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు కనుల పండువగా సాగుతున్నాయి. ఇందులో అత్యంత ముఖ్య ఘట్టం మంగళవారం వేకువ జామున జరిగింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా సోమవారం అర్ధరాత్రి నుంచి భక్తులు ఆలయం వద్ద కిలో మీటర్ల కొద్ది బారులుదీరారు. ఆలయ పరిసరాలు విద్యుత్ దీప కాంతులతో దేదీప్యమానంగా వెలిగాయి. సప్త వర్ణ పుష్పాలతో ఆలయ ధ్వజ స్తంభం, ఉత్తర ద్వార ప్రవేశ మార్గం, పరిసరాలను అలంకరించారు. మంగళవారం వేకువజామున మూడు గంటల నుంచి ఆలయంలో ప్రత్యేక పూజాది కార్యక్రమాలు జరిగాయి. స్వామివారిని సర్వాలంకార భూషితుడ్ని చేశారు. చిలుకల మాలను, రత్నాల పంచెను ధరించిన శ్రీరంగనాథ స్వామి వారు ఐదున్నర గంటల సమయంలో ఉత్తరద్వార ప్రవేశం చేశారు. స్వామివారితో పాటూ భక్త జనం పెద్దసంఖ్యలో స్వర్గ ద్వారం వైపుగా దూసుకెళ్లారు. అనంతరం స్వామి వారు ఆలయంలోని బంగారు ధ్వజ స్తంభాన్ని చుట్టినానంతరం వెయ్యికాళ్ల మండపానికి చేరుకున్నారు. అక్కడి నుంచి భక్తులకు స్వామి వారు దర్శనం ఇచ్చారు. అనంతరం భక్తులను ఉత్తర ద్వారం గుండా ఆలయంలోని మూల విరాట్‌ను దర్శించుకునే అవకాశం కల్పించారు. దేశ విదేశాలకు చెందిన భక్తులు సైతం స్వామి వారిని దర్శించుకుని పునీతులయ్యారు. శ్రీరంగం గోవిందా..గోవిందా... నారాయణ. . నారాయణ.. రంగా..శ్రీరంగ నామస్మరణతో పులికించింది.
పార్థసారథి ఆలయంలో..
చైన్నె ట్రిప్లికేన్‌లోని పార్థసారథి ఆలయం సైతం 108 ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రాల్లో ఒకటిగా ఉంది.వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని వేకువ జామున ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. 5 గంటలకు స్వామివారు ఊరేగింపుగా ఆలయ మాడ వీధుల్లో భక్తులకు దర్శనం ఇచ్చారు. పెద్దసంఖ్యలో హాజరైన భక్తులతో ఆలయం, పరిసరాలు మునిగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పెద్ద సంఖ్యలో బందోబస్తు నిర్వహించారు. అలాగే, విరుదునగర్ జిల్లా శ్రీవిళ్లిపుత్తూరులోని ఆండాల్ అమ్మవారి ఆలయం, సేలంకోట్టై పెరుమాల్ ఆలయం, మన్నాకుడి శ్రీమన్నారాయణ ఆలయం, తిరునీరు మలై గోవిందుడి ఆలయం, తిరుక్కోవిలూరు పెరుమాల్ ఆలయం, షోళింగర్, కుంభకోణం, మదురై తల్లాకులంలోని ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం, అళగర్ మలై కళ్లలగర్, తిరువొత్తియూరు పెరుమాళ్ తదితర వైష్ణవ ఆలయాల్లో భక్తి భావం మిన్నంటే విధంగా పూజాది కార్యక్రమాలు జరిగాయి. అన్ని ఆలయాల్లో వైకుంఠ ద్వారా ప్రవేశం నిమిత్తం వేకువ జాము నుంచే భక్త జనలు ఆలయాల వద్ద బారులు తీరారు. గోవింద నామస్మరణ మిన్నంటే రీతిలో భక్తులు స్వామి వారిని స్మరిస్తూ వైకుంఠ ద్వార ప్రవేశం చేశారు. కృష్ణగిరిలోని పెరుమాల్ ఆలయంలో మత సామరస్యం చాటే విధంగా వేడుక జరిగింది. ఉత్తర ద్వారా ప్రవేశం సందర్భంగా భక్తులకు మైనారిటీలు శీతల పానీయలు, బిస్కెట్లు తదితర వాటిని అందజేశారు.
టీ.నగర్ శ్రీవారి ఆలయంలో..
^ðlO¯ðl² sîæ¯]l-VýS-ÆŠ‡ÌZ †Æý‡$Ð]l$ÌS †Æý‡$糆 §ólÐ]lÝ릯]l… A«§ýlÓ-Æý‡Å…ÌZ MöË$OÐðl E¯]l² MýSÍ-Ķæ¬VýS {ç³™èlÅ„ýS O§ðlÐ]l… }Ðól…-MýS-sôæÔèæÓÆý‡ ÝëÓÑ$ BÌS-Ķæ$…ÌZ OÐðlMýS$…uý‡ HM>§ýlÕ ç³Ngê¨ M>Æý‡Å-{MýS-Ð]l*Ë$ A…VýS-Æý‡…VýS… OÐðl¿ýæÐ]l…V> fÇ-V>Ƈ$$. sîæsîæ yీ Ý린MýS HDK «§ýl¯]l$…f-ÄŒæ$ ¯ól™èl–-™èlÓ…ÌZ ¿ýæMýS$¢ÌS MøçÜ… {ç³™ólÅMýS HÆ>µr$Ï ^ólÔ>Æý‡$. Ý린MýS çÜÌSà Ð]l$…yýlÍ Ð]l*i O^ðlÆý‡Ã¯]l$Ï, Ð]l*i çÜ¿¶æ$ÅË$, {ç³Ð]l¬Q$Ë$ B¯]l…-§ýl-MýS$Ð]l*-ÆŠ‡-Æð‡yìlz, } MýS–çÙ~, A°-ÌŒæ-MýS$-Ð]l*ÆŠ‡Æð‡yìlz, ^èl…{§ýl-Ôóæ-QÆŠæ, }°-ÐéçÜ Æð‡yìlz, Ððl*çßæ¯ŒS Æ>Ð]l#, ¯]lÆý‡-íÜ…-çßæ-Æ>Ð]l#, AÔZMŠS ™èl¨-™èl-Æý‡$Ë$ HÆ>µ-rϯ]l$ ç³Æý‡Å-Ðól„ìS…^éÆý‡$. ™ðlÌSÏ-Ðé-Æý‡$-gê-Ð]l¬¯]l ÝëÓÑ$-Ðé-ÇMìS {ç³™ólÅMýS AÀõ-ÙM>¨ ç³Nf-ÌS¯]l$ BÌSĶæ$ AÆý‡a-MýS$Ë$ Ô>[Ýù¢-MýS¢…V> °Æý‡Ó-íßæ…^éÆý‡$. E™èlÞ-Ð]l-Æý‡$-ÌS¯]l$ {ç³™ólÅ-MýS…V> AÌS…-MýS-Ç…_ BÌSĶæ$ {´ë…VýS-׿…ÌZ FÆó‡-W…-^éÆý‡$. A¯]l…™èlÆý‡… ¿ýæMýS$¢ÌSMýS$ BÌSĶæ$ {ç³ÐólÔèæ… MýS͵…-^é-Æý‡$.-ò³§ýlª çÜ…QÅÌZ ™èlÆý‡Í Ð]l_a¯]l ¿ýæMýS$¢Ë$ ÝëÓÑ$-Ðé-ǰ §ýlÇØ…^èl$MýS$¯é²Æý‡$. CMýS, DïÜ-B-ÆŠ‡ÌZ° }Æ>-«§é-MýS–çÙ~ BÌS-Ķæ$…-ÌZ¯]l* OÐðlMýS$…uý‡ HM>§ýlÕ {ç³™ólÅMýS ç³NfË$ MýS¯]l$ÌS ç³…yýl$-Ð]lV> fÇ-V>Ƈ$$.
శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో..
టౌన్ లోని 300 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఉదయాన్నే వాసవీ అమ్మవారికి క్షీరాభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు అనంతరం ఉత్తర ద్వార దర్శనం జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, సీతారామ లక్ష్మణులను విశేషంగా అలంకరించి ఆలయ అర్చకులు భాస్కర్ పంతులు, దిలీప్ పంతులు బృందం విశేష పూజా కార్యక్రమాలు చేశారు. సాయంత్రం 6 గంటలకు పెద్దసంఖ్యలో తరలి వచ్చిన మహిళలు కుంకుమార్చన ను భక్తిశ్రద్ధలతో చేశారు. రాత్రి 7 గంటలకు విశేషాలంకరణలోని స్వామి, అమ్మవార్లు భక్తులకు ఆశీస్సులను అందించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా పరమపద ఆటలు ,విష్ణు సహస్రనామ పారాయణం ,శ్రీ లలితా సహస్రనామ పారాయణం తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలతో వైకుంఠ ఏకాదశి జరుపుకున్నారు.
పాహిమాం!
పాహిమాం!
పాహిమాం!
పాహిమాం!


