
వారికి నచ్చినట్లే నటిస్తా !
తమిళసినిమా: విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం, చివరి చిత్రం జననాయకన్. నటి పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో మమిత బైజు, బాలీవుడ్ నటుడు బాబీడియోల్, ప్రియమణి, నరేన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. హిట్ చిత్రాల దర్శకుడు హెచ్.వినోద్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రాన్ని కేవీఎన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్‌లో నిర్మిస్తోంది. షూటింగ్‌ను పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈచిత్రం 2026 సంక్రాంతి సందర్భంగా జనవరి 9న విడుదలకు సిద్ధమవుతోంది. విజయ్ నటిస్తున్న చివరి చిత్రం కావడంతో జననాయకన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇది ఒక తెలుగు చిత్రానికి రీమేక్ అంటూ ప్రచారం జరుగుతోంది. అయితే దీన్ని దర్శకుడు హెచ్.వినోద్ ఖండించారు. దీంతో జననాయకన్ చిత్రం ఎలా ఉంటుంది? 2026లో జరగనున్న శాసన సభ ఎన్నికల్లో విజయ్ విజయానికి ఈ చిత్రం ఎంతవరకు హెల్ప్ అవుతుంది అనే చర్చ ఇటు సినీ పరిశ్రమలోనూ, అటు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో చిత్ర దర్శకుడు హెచ్.వినోద్ జననాయకన్ చిత్రానికి సంబంధించి అప్‌డేట్‌ను ఇటీవల ఒక వేదికపై వెల్లడించారు. ఇది విజయ్‌కు పక్కా వీడ్కోల్ చిత్రంగా ఉంటుందన్నారు. మాస్, కమర్షియల్, యాక్షన్ అంశాలు చోటు చేసుకుంటాయి అని చెప్పి విజయ్ అభిమానుల్లో ఫుల్‌జోష్‌ను నింపారు.

వారికి నచ్చినట్లే నటిస్తా !