
పగ, ప్రతీకారాల ఇంద్ర
తమిళసినిమా: ఇంద్ర చాలా పవర్‌ఫుల్ టైటిల్. ఇదైతే ఇంతకుముందు తెలుగులో చిరంజీవి హీరోగా నటించిన చిత్రం రూపొంది సంచలనం విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అదే టైటిల్‌తో ఇప్పుడు తమిళంలో వసంత్ రవి కథానాయకుడిగా నటించిన చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. మెహ్రిన్ నాయకిగా నటించిన ఇందులో టాలీవుడ్ ప్రముఖ నటుడు సునీల్, కల్యాణ్ మాస్టర్, అనిఖ సురేంద్రన్ రాజ్‌కుమార్ ముఖ్యపాత్రలు పోషించారు. శబరినంద కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రాన్ని జేఎస్‌ఎం మూవీ ప్రొడక్షన్‌న్స్ అండ్ ఎంపీరర్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై జాఫర్ సాధిక్, ఇర్ఫాన్ మాలిక్ నిర్మించారు. అజ్మల్ తహ్సీన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నేడు తెరపైకి రానుంది. దీన్ని తమిళనాడు వ్యాప్తంగా ట్రైడెంట్ ఆర్ట్స్ సంస్థ విడుదల చేస్తుంది. ఇందులో వసంత్ రవి చూపు కోల్పోయిన పోలీస్ అధికారిగా నటించారు. ఆయనకు జంటగా మెహ్రీన్ నటించగా, విలన్ పాత్రలో సునీల్ నటించారు. ఈ చిత్రంలో సీరియల్ హత్యలు జరుగుతుంటాయి. ఆ హత్యలు చేసింది ఎవరు? ఎందుకు చేశారు వంటి పలు ఆసక్తికరమైన సన్నివేశాలతో సాగే కథ చిత్రం ఇంద్ర. చిత్ర కథానాయకుడికి కంటిచూపు కోల్పోవడానికి కారణం ఏమిటి? అయినప్పటికీ సంచలనంగా మారిన హత్యల వెనక ఎవరు ఉన్నారు? ఆ హంతకులను హీరో పట్టుకోగలిగారా వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో సాగే ఉత్కంఠ భరిత సస్పెన్స్ ఇన్వెస్టిగేషన్ చిత్రం ఇంద్ర.

పగ, ప్రతీకారాల ఇంద్ర