
బాంబు బూచీతో కలకలం
సాక్షి, చైన్నె : చైన్నెలో విండ్సర్ హౌస్ తన విజన్‌ను ఆవిష్కరించింది. ఆదివారం జరిగిన సమావేశానికి విండ్సర్ హౌస్ ప్రతినిధులు కన్వర్ సింగ్ (వ్యాపార అభివృద్ధి), పర్వాణి దావర్ (విద్యా శాస్త్రం), నేహా దోల్వాని (కార్పొరేట్ చైల్డ్ కేర్) హాజరయ్యారు. విద్యావేత్తలు, ప్రీస్కూల్ వ్యవస్థాపకులు, నిపుణులు తరలి వచ్చారు. విద్యలో కొత్త ప్రయాణానికి నాంది పలికేందుకు విండ్సర్ హౌస్ సైన్స్ ఆధారిత, విలువలతో కూడిన అభ్యాసం, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న పిల్లలను పోషించడం లక్ష్యంగా చర్యలతో తమ విజన్‌ను ప్రకటించింది. పిల్లల భావోద్వేగ శ్రేయస్సు , తల్లిదండ్రుల బలమైన భాగస్వామ్యాలను ఏకీకృతం చేసింది. కన్వర్ సింగ్ మట్లాడుతూ విండ్సర్ ప్రీమియం ఫ్రాంచైజ్ రోడ్ మ్యాప్, విస్తరణ ప్రణాళికలను వివరించారు. పర్వాణి దావర్ మాట్లాడుతూ పరిశోధన ఆధారిత ప్రపంచ పాఠ్యాంశాలు, వ్యక్తిగతీకరించిన అభ్యాస విధానాన్ని గురించి తెలియజేశారు. నేహా దోల్వానీ మాట్లాడుతూ పిల్లల సంరక్షణ, పరిష్కారాలు, కార్యాలయ శ్రేయస్సు గురించి పేర్కొన్నారు. లీనమయ్యే తరగతి గది వాక్–త్రూ విండ్సర్ బహుళ అభ్యాస సామాగ్రి, సాంకేతిక ఏకీకరణ, భావోద్వేగ మేధస్సు, సమ్మిళిత వాతావరణాలు వంటి అంశాలను వివరించారు. విండ్సర్ హౌస్ త్వరలో పూణే, హైదరాబాద్, బెంగళూరులలో కేంద్రాలను ప్రారంభించనున్నట్టు ప్రకటించారు.
కాటాన్ కొళత్తూరులో పోలీసుల సోదాలు
సాక్షి, చైన్నె : కాటాన్ కొళత్తూరు పరిసరాలలో పోలీసులు విస్తృత సోదాలలో నిమగ్నమయ్యారు. ఇక్కడి విద్యార్థుల హాస్టళ్లలో తనిఖీలు చేశారు. కాటాన్ కొళత్తూరులో ప్రముఖ విశ్వవిద్యాలయం ఒకటి ఉంది. ఈ పరిసరాలలో అనేక హాస్టళ్లు, పీజీ హాస్టళ్లు, ప్రైవేటు మాన్షన్లు అనేకం ఉన్నాయి. వీక్ ఎండ్ రోజైన శనివారం వేళ ఈ పరిసరాలలో విస్తృతంగా మాదక ద్రవ్యాల వాడకం జరుగుతున్నట్టుగా ఆరోపనలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో శనివారం తాంబరం డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు పవన్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో 100 మంది పోలీసులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. దుకాణాలు, హోటళ్లు, అపార్ట్‌మెంట్‌లు, విద్యార్థులు బస చేసి ఉన్న ప్రాంతాలలో విస్తృతంగా సోదాలు చేశారు. ఇందులో పెద్దసంఖ్యలో గంజాయి చాక్లెట్లు, గుట్కా, హాన్స్ తదితర నిషేధిత వస్తువలు ప్యాకెట్లు సీజ్ చేశారు.
అనారోగ్యంతో ఉండే పిచ్చి, వీధి కుక్కలను..
●వైద్యుల సూచనలతో సంహరించవచ్చు
●తమిళనాడు ప్రభుత్వ అనుమతి
కొరుక్కుపేట: తమిళనాడులో వీధికుక్కల సమస్య రోజురోజుకూ పెరుగుతోంది. దీని కారణంగా, ప్రజలు రోజూ ఇబ్బందులు పడుతున్నారు. తమిళనాడులో 2022లో 3,65,318గా ఉన్న కుక్క కాటు కేసుల సంఖ్య 2023లో 4,40,921కి పెరిగింది. ఈ సంవత్సరం మొదటి నెలల్లోనే 1,24,000 జరుగగా కుక్క కాటు సంఘటనలు కొనసాగుతున్నాయి. వీధికుక్కల కాటు వల్ల రేబిస్ ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నందున, వ్యాధిని వ్యాప్తి చేసే వీధికుక్కలను చంపాలని, అందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి అభ్యర్థనలు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో తమిళనాడు ప్రభుత్వం తాజాగా ఓ ఉత్తర్వు జారీ చేసింది. అందులో ఇలా.. తమిళనాడులో పెరుగుతున్న వీధికుక్కల సంఖ్య సాధారణ ప్రజలను ప్రభావితం చేస్తోంది. ఈనేపథ్యంలో అనారోగ్యంతో ఉన్న వీధికుక్కలను చంపబడే కుక్కలకు సంబంధించిన పత్రాలను కూడా సరిగ్గా నిర్వహించాలని పేర్కొంది. ఈమేరకు వైద్యుల సూచనలు పాటించాలని సూచించింది.

బాంబు బూచీతో కలకలం