తిరువణ్ణామలైలో ఆర్కే రోజా పూజలు | - | Sakshi
Sakshi News home page

తిరువణ్ణామలైలో ఆర్కే రోజా పూజలు

Jul 10 2025 8:14 AM | Updated on Jul 10 2025 8:14 AM

తిరువ

తిరువణ్ణామలైలో ఆర్కే రోజా పూజలు

వేలూరు: తిరువణ్ణామలైలో పౌర్ణమి రోజున శివుడిగా భావించే అన్నామలైయర్‌ కొండను 14 కిలోమీటర్ల దూరం చుట్టి రావడం ఆనవాయితీ. మంగళవారం సాయంత్రం ప్రదోష దినోత్సవం పురస్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో గిరి వలయం వచ్చారు, ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి సినీ నటి రోజా గిరి వలయం రోడ్డులో 14 కిలోమీటర్ల దూరం కాలినడకన నడిచి వచ్చారు. దారిలోని అష్ట లింగ ఆలయంలో దీపాన్ని వెలిగించి పూజలు చేశారు. భక్తులు ఆమెతోపాటు సెల్ఫీ తీసుకునేందుకు ఆసక్తి చూపారు.

ఇండో – రొమేనియా సంబంధాలు మరింత బలోపేతం

సాక్షి, చైన్నె : ఇండో – రొమేనియా సంబంధాలను బలోపేతం చేయడంలో భాగంగా సాంస్కృతిక దౌత్యాన్ని చాటుకునే విధంగా హెచ్‌ ఐటీఎస్‌ 21వ శతాబ్దపు స్టూడియో ఏర్పాటు చేశారు. హిందూస్తాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ చైన్నె క్యాంపస్‌లో జరిగిన విశిష్ట ఉపన్యాసం కార్యక్రమం ద్వారా 21వ శతాబ్దపు స్టూడియోను ప్రారంభించడం ద్వారా ఇండో–రొమేనియన్‌ సంబంధాలను బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించామని బుధవారం నిర్వాహకులు ప్రకటించారు. ఈ కార్యక్రమం రెండు దేశాల మధ్య అంతర్జాతీయ సహకారం , సాంస్కృతిక సహకారం కీలకం కానుంది. ఈ కార్యక్రమంలో ప్రపంచానికి రొమేనియా సహకారం , ఇండో–రొమేనియన్‌ స్నేహంపై భారతదేశంలో రొమేనియా రాయబారి సేనా లతీఫ్‌ ప్రసంగించారు. సృజనాత్మక పరిశ్రామికం, వీడియో చిత్రీకరణ, విద్యను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా అత్యాధునిక 21వ శతాబ్దపు వీడియో స్టూడియో ను ఈసందర్భంగా ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు, కేరళకు సంబంధించిన రొమేనియా గౌరవ కాన్సుల్‌ జనరల్‌ డాక్టర్‌ విజయ్‌ మెహతా, స్ట్రాటజిక్‌ గ్లోబల్‌ అడ్వైజర్‌, ఫిల్మ్‌ మేకర్‌ , సామాజిక కార్యకర్త డాక్టర్‌ సంజానా జోన్‌, హిందుస్థాన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ – సైన్స్‌ ప్రో చాన్స్‌లర్‌ డాక్టర్‌ అశోక్‌ జార్జ్‌ వర్గీస్‌, డిప్యూటీ డైరెక్టర్‌ ఎనిద్‌ వర్గీస్‌ జాకబ్‌, ప్రో చాన్స్‌లర్‌ డాక్టర్‌ అశోక్‌ జార్జ్‌ వర్గీస్‌ తదితరులు పాల్గొన్నారు.

లాయిడ్స్‌ టెక్నాలజీ సెంటర్‌తో ఐఐటీ మద్రాసు ఒప్పందం

కొరుక్కుపేట: ఐఐటీ మద్రాసు లోని వాధ్వానీ స్కూల్‌ ఆఫ్‌ డేటా సైన్స్‌ అండ్‌ ఏఐ, టెక్నాలజీ అండ్‌ డేటా కంపెనీ అయిన లాయిడ్స్‌ టెక్నాలజీ సెంటర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈమేరకు బుధవారం జరిగిన కార్యక్రమంలో వాధ్వానీ స్కూల్‌ ఆఫ్‌ డేటా సైన్స్‌ అండ్‌ ఏఐ అధిపతి ప్రొ ఫెసర్‌ బలరామన్‌ రవీంద్రన్‌, లాయిడ్స్‌ టెక్నాలజీ సెంటర్‌ సీఈవో శిరీష వోరుగంటి సమక్ష్యంలో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. పరిశోధన ఆధారిత పారిశ్రామిక ప్రాజెక్టులు , లోతైన పరిశోధన ప్రాజెక్టులు తోపాటు పరిశోధన అవకాశాలను పెంపొందించేలా ఈ అవగాహన ఒప్పందం చేసుకున్నట్టు వెల్లడించారు.

13 మందికి సమన్లు

సాక్షి, చైన్నె: గేట్‌ కీపర్‌, రైల్వే అధికారులు, సిబ్బంది సహా 13 మందికి సమన్లు జారీ అయ్యాయి. దక్షిణ రైల్వే ఉన్నత స్థాయి కమిటీ ఎదుట వీరు విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. వివరాలు.. కడలూరు జిల్లా సెమ్మంకుప్పం రైల్వే క్రాసింగ్‌లో స్కూల్‌ వ్యాన్‌ను రైలు ఢీకొన్న విషయం తెలిసిందే. ఈప్రమాదంలోముగ్గురు విద్యార్థులు మృతిచెందారు. మరో విద్యార్థి గాయాలతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యాడు. ఈ ప్రమాద ఘటనపై ఉన్నత స్థాయి కమిటీ విచారణకు దక్షిణ రైల్వే ఆదేశించింది. దీంతో గేట్‌కీపర్‌ పంకజ్‌ శర్మతోపాటు, రైల్వే అధికారులు, సిబ్బంది సహా 13 మందికి సమన్లు జారీ అయ్యాయి. దీంతో వారంతా విచారణకు హాజరు కావాల్సి ఉంది. అలాగే ప్రమాద ఘటనపై పోలీసులు సైతం దర్యాప్తు వేగవంతం చేశారు. గేట్‌ కీపర్‌ ఉత్తరాది వాసి కావడంతో వ్యవహారం ఉద్రిక్తతకు దారి తీసిన విషయం తెలిసిందే. దీంతో పంకజ్‌శర్మను విధుల నుంచి తప్పించి విచారణ పరిధిలోకి తెచ్చారు. అతని స్థానంలో తమిళనాడుకు చెందిన ఆనంద్‌ రాజ్‌ను గేట్‌ కీపర్‌గా నియమించారు.

తిరువణ్ణామలైలో  ఆర్కే రోజా పూజలు   1
1/2

తిరువణ్ణామలైలో ఆర్కే రోజా పూజలు

తిరువణ్ణామలైలో  ఆర్కే రోజా పూజలు   2
2/2

తిరువణ్ణామలైలో ఆర్కే రోజా పూజలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement