– మరో విద్యార్థికి గాయాలు
తిరువొత్తియూరు: వరత్తనాడు సమీపంలో కొబ్బరి కోస్తున్న సమయంలో కత్తి విద్యుత్తు తీగకు తగలడంతో షాక్ తగిలి ప్లస్–2 విద్యార్థి మృతి చెందాడు. మరొక విద్యార్థి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివరాలు.. తంజావూరు జిల్లా వరత్‌నాడు సమీపంలోని చిలుత్తూర్ వెట్టికాడు కష్ణాపురం ప్రాంతానికి చెందిన భారతి(16). ఇతను వెట్టికాడలో ఉన్న పాఠశాలలో ప్లస్–2 చదువుతున్నాడు. భారతి తన ఇంటిలో ఉన్న కొబ్బరి చెట్టుపై ఎక్కి కొబ్బరి కోసేందుకు ఇనుము తో చేసిన పట్టా కత్తి ద్వారా యత్నించాడు. ఆ సమయంలో ఉన్న కత్తి విద్యుత్ తీగకు తగలడంతో ఘటన స్థలంలోని భారతి మృతి చెందాడు. ఆ సమయంలో అక్కడ వున్న భారతి స్నేహితుడు 10 తరగతి చదువుతున్న కేశవన్ కూడా గాయపడ్డాడు. వరత్‌నాడు పోలీసులు కేసు నమోదు చేసి మృతి చెందిన భారతి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. డీఎస్పీ కార్తికేయన్ కేసు విచారణ చేస్తున్నారు.