
తమిళసినిమా: అక్టోబర్ 4వ తేదీ తమిళసినిమా పరిశ్రమలో ప్రత్యేక రోజుగా గుర్తుండిపోతుందని చెప్పవచ్చు. బుధవారం సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం, దళపతి విజయ్ 68వ చిత్రం, అదేవిధంగా అజిత్ 62వ చిత్రం షూటింగ్‌లు ప్రారంభమయ్యాయి. వీటిలో రెండు భారీ చిత్రాలను లైకా సంస్థనే నిర్మించడం విశేషం. రజనీకాంత్ నటిస్తున్న 170వ చిత్రం కేరళలోని తిరువనంతపురంలోని ఒక పాడుబడ్డ భవనంలో ప్రారంభమైంది. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జై భీమ్ చిత్రం ఫేమ్ టీజే.జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు. అమితాబ్‌బచ్చన్, ఫాహద్ ఫాజిల్, రానా, నటి మంజువారియర్, రిత్వికాసింగ్, దుషారా విజయన్ భారీ తారాగణం నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు.
కాగా నటుడు విజయ్ హీరోగా నటిస్తున్న 68వ చిత్రం షూటింగ్ చైన్నెలోని ప్రసాద్‌ల్యాబ్‌లో పాట చిత్రీకరణతో మొదలైంది. ఈ ఇంట్రో సాంగ్‌కు ప్రభుదేవా నృత్య దర్శకత్వం వహిస్తున్నారు. వెంకట్‌ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నటి స్నేహ, మాళవికమోహన్, మీనాక్షీ చౌదరి నటిస్తున్నారు. దీనికి యువన్‌శంకర్‌రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ఏజీఎస్ ఎంటర్‌టెయిన్‌మెంట్ సంస్థ బిగిల్ వంటి హిట్ చిత్రం తరువాత విజయ్‌తో నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఇది. ఇకపోతే ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అజిత్ 62వ చిత్రం ఇన్నాళ్లకు సెట్‌సైకి వెళ్లింది.లైకా సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మగిళ్ తిరుమేణి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నటి త్రిష, ప్రియాభవానీ శంకర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం అజర్‌బైజాన్ దేశంలో ప్రారంభమైంది.

విజయ్

అజిత్

రజనీకాంత్