ప్రాణం తీసిన ఏసీ | - | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన ఏసీ

Oct 1 2023 1:06 AM | Updated on Oct 1 2023 8:20 AM

- - Sakshi

సాక్షి, చైన్నె: ఏసీలో ఏర్పడిన మంటలు, పొగ కారణంగా ఊపిరి ఆడకపోవడంతో తల్లి కుమార్తె మరణించారు. శనివారం ఈ ఘటన అంబత్తూరు సమీపంలోని చోటు చేసుకుంది. వివరాలు.. చైన్నె శివారులోని అంబత్తూరు మీనంబేడు ఏకాంబర నగర్‌లో ఆదిల(50) తన కుమార్తె నష్రీన్‌(16)తో నివాసం ఉన్నారు. ఆమె భర్త రహ్మన్‌ ఇటీవల మరణించాడు. తమ బంధువుకు చెందిన ఇంట్లో వీరు అద్దెకు ఉన్నారు. నష్రీన్‌ సమీపంలోని పాఠశాలలో ప్లస్‌–2 చదువుతోంది. ఆదిల అదే ప్రాంతంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్నారు.

శనివారం ఉదయం వీరు నివాసం ఉన్న ఇంటి నుంచి పొగ రావడాన్ని ఇరుగు పొరుగు వారు గుర్తించారు. తలుపులు పగుల కొట్టి చూడగా... లోపల తల్లికుమార్తె స్పృహ తప్పిపడి ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. తర్వాత ఆ ఇద్దరు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం కీల్పాకం ఆస్పత్రికి పోలీసులు తరలించారు. విచారణలో ఏసీలో షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా మంటలు, పొగ రావడంతో కారణంగా ఊపిరి ఆడక ఆ ఇద్దరూ మరణించినట్లు తేలింది.

Advertisement
 
Advertisement
Advertisement