
హత్యకు గురైన భర్త భారతితో నిందితుడు
తమిళనాడు: తంజావూరులో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్యను పోలీసులు అరెస్టు చేశారు. తంజావూరు జిల్లా తిరుపనందాల్ పక్కనే ఉన్న కిల్మందూర్ పాత వీధికి చెందిన భారతి (35) చెందిన చైన్నెలోని ఓ హోటల్‌లో టీ మాస్టర్‌గా పనిచేశాడు. అతనికి భార్య దివ్య (27) ఉంది. అతను మే 16న కీలుమందూరుకు వచ్చిన భారతి తిరిగి చైన్నె వెళ్లలేదు.
బంధువులు, స్నేహితులు 10 రోజులుగా పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. భారతి సోదరి భర్త సెల్వమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అతని మొబైల్ ఫోన్ సంభాషణలపై నిఘా పెట్టారు. అతని భార్య దివ్య అదే పట్టణంలోని ఆర్జే నగర్‌కు చెందిన సతీష్‌కుమార్ అలియాస్ డేవిడ్ (38)తో తరచూ మాట్లాడుతున్నట్టు గుర్తించారు.
ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా హత్య విషయం వెలుగులోకి వచ్చింది. సతీష్‌కుమార్‌తో దివ్యకు వివాహేతర సంబంధం ఉందని, వారికి భారతి అడ్డుగా ఉండడంతో గొంతుకోసి హత్య చేసి అనంతరం మృతదేహాన్ని పట్టం గ్రామంలోని నది వంతెనపై నుంచి పడేసినట్టు తేలింది. దీంతో దివ్య, డేవిడ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.