రామేశ్వరంలో మత్స్యకారుల నిరసన | - | Sakshi
Sakshi News home page

రామేశ్వరంలో మత్స్యకారుల నిరసన

Dec 25 2025 8:17 AM | Updated on Dec 25 2025 8:17 AM

రామేశ్వరంలో మత్స్యకారుల నిరసన

రామేశ్వరంలో మత్స్యకారుల నిరసన

● రూ. కోటి విలువైన చేపల వ్యాపారంపై ప్రభావం

● రూ. కోటి విలువైన చేపల వ్యాపారంపై ప్రభావం

కొరుక్కుపేట: రామనాథపురం జిల్లాలోని రామేశ్వరం సమీపంలోని తంగచిమడం వద్ద 12 మంది మత్స్యకారులను మంగళవారం శ్రీలంక నావికాదళం అరెస్టు చేసింది. ఈ చర్యను నిరసిస్తూ మత్స్యకారులను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ, మహిళలు సహా ప్రజలు తంగచిమడంలో రోడ్డుపై సమ్మెకు దిగారు. ఫలితంగా రామేశ్వరం ఓడరేవు , ఫిషింగ్‌ ల్యాండింగ్‌ సైట్‌లో 750కి పైగా ఫిషింగ్‌ బోట్లు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. సముద్రంలోకి వెళ్లకుండానే లంగరు వేశారు. 5 వేల మంది జాలర్లు, మత్స్యకార పరిశ్రమలో పాల్గొన్న మొత్తం 5 వేల మంది ప్రజలు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. ఫలితంగా రామేశ్వరం ఓడరేవు వెలవెలబోయింది. జాలర్ల సమ్మె కారణంగా రూ. కోటి విలువైన చేపల వ్యాపారం ప్రభావితమైంది. అరెస్టు చేసిన 12 మంది మత్స్యకారులతో పాటు శ్రీలంక జైలులో ఉన్న ఇతర మత్స్యకారులను విడుదల చేయడానికి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మత్స్యకారులు నినాదాలు చేశారు.

చైన్నెలో అమిత్‌ షా తిష్ట...?

సాక్షి, చైన్నె: 2026లో కొన్ని నెలల పాటూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా చైన్నెలో తిష్ట వేయబోతున్నట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. ఆయన కోసం పనయూరులో ప్రత్యేక భవనాన్ని ఎంపికచేసే పనిలో బీజేపీ వర్గాలు ఉన్నట్టు చర్చ ఊపందుకుంది. తమిళనాడులో డీఎంకేను గద్దె నుంచి దించి తీరుతామని ఇప్పటికే పలుమార్లు అమిత్‌ షా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. 2026 ఫిబ్రవరిలో నగారాగా మోగవచ్చు అన్న సంకేతాలతో ఎన్నికల అయ్యే వరకు అమిత్‌ షా తన పూర్తి దృష్టికి తమిళనాడు వైపుగా పెట్టేందుకు సిద్ధమైనట్టు సమాచారాలు వెలువడ్డాయి. ఇక్కడ హోటళ్లలో ఉండటం కన్నా, పార్టీ వర్గాలకు చేరువలో ఉండే విధంగా, అన్నింటికి కేంద్రంగా ఓ బ్రహ్మాండ భవనాన్ని ఎంపిక చేసి, ఇక్కడ కొన్ని నెలల పాటుగా అమిత్‌ షా తిష్ట వేయబోతున్నారన్న చర్చ ఊపందుకుంది. ఇందుకోసం టీవీకే నేత విజయ్‌ నివాసం ఉన్న పనయూరులో అన్ని రకాల వసతులతో కూడిన ఓ బ్రహ్మాండ భవనాన్ని తాత్కాలికంగా అద్దెకు తీసుకునే ప్రయత్నాలను బీజేపీ వర్గాలు విస్తృతం చేసినట్టు సమాచారాలు వెలువడటం గమనార్హం. కాగా, ప్రధాని నరేంద్రమోదీకి అత్యంత సన్నిహితుడైన అమిత్‌ షా రచించి ఇచ్చే వ్యూహాలకు మంచి ఫలితాలు వస్తున్నయన్నది బీజేపీ వర్గాలు వాదన. ఆ దిశగా తమిళనాట సైతం తీవ్రంగానే వ్యూహాలను అమలు చేయడానికి తాత్కాలికంగా ఆయన ఇక్కడే తిష్ట వేస్తారన్న చర్చ ఊపందుకుంది.

కీచక తండ్రికి మరణ శిక్ష

సాక్షి, చైన్నె : కూతురిపై పదే పదే లైంగిక దాడికి పాల్పడి, ఆమెను గర్భవతిని చేసిన కీచక తండ్రికి మరణ శిక్ష విధిస్తూ తిరునల్వేలి పోక్సో కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. బాధితురాలికి రూ. 10 లక్షలు పరిహారం అందజేయాలని ప్రభుత్వాన్ని న్యాయమూర్తి సురేష్‌కుమార్‌ ఆదేశించారు. తిరునల్వేలి జిల్లా నాంగునేరికి చెందిన 14 ఏళ్ల బాలిక హఠాత్తుగా అనారోగ్యం బారిన పడటంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆమె గర్భవతి అని తేలింది. ఆమె వద్ద జరిపిన విచారణలో తన తండ్రి ఇసక్కి ముత్తు తనపై జరిపిన లైంగిక దాడిని వివరించారు. పలుమార్లు తనపై దాడి చేసినట్టు, బయటకు చెబితే చంపేస్తానని బెదిరించినట్టు పేర్కొంది. దీంతో ఇసక్కి ముత్తును పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు తిరునల్వేలి పోక్సో కోర్టు న్యాయమూర్తి సురేష్‌కుమార్‌ తీర్పు వెలువరించారు. మరో కీచకుడు ఇలాంటి చర్యలకు పాల్పడకుండా ఇసక్కి ముత్తుకు మరణ శిక్షణ విధించారు. ఆ బాలికకు పరిహారంగా రూ. 10 లక్షలు అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.

రూ.4 కోట్ల విలువైన గంజాయి సీజ్‌

అన్నానగర్‌: రామనాథపురం తూర్పు తీర రోడ్డు ప్రాంతంలోని ఓ తోటలో శ్రీలంకకు అక్రమంగా తరలించడానికి పెద్దమొత్తంలో గంజాయిని నిల్వ ఉంచినట్లు రామనాథపురం కెనికరై పోలీసులకు సమాచారం అందింది. దీంతో బుధవారం తెల్లవారుజామున 1 గంటల ప్రాంతంలో, రామనాథపురం లా కాలేజీ సమీపంలోని దక్షిణవాణి రోడ్డు ప్రాంతంలోని పసుపతి పాండియన్‌ తోటలో ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఆ సమయంలో, పోలీసులను చూసి అక్కడి నుండి కొంతమంది పారిపోయారు. పోలీసులు వారిని వెంబడించారు. వీరిలో హరికరణ్‌ (19) మాత్రమే పట్టుబడ్డాడు. అతనితో నిర్వహించిన విచారణలోతోటలో గంజాయి నిల్వ ఉంచినట్లు అతను చెప్పాడు. దీని తర్వాత, అక్కడ తనిఖీ చేసి సుమారు 550 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంలో అనుమానంతో, మండపం, వేదలై, రామనాథపురం ప్రాంతాలకు చెందిన మరో 9 మందిని అరెస్టు చేసి, తీవ్ర దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయి అంతర్జాతీయ విలువ రూ. 4 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement