ప్రమాదంలో బాలిక మృతి | - | Sakshi
Sakshi News home page

ప్రమాదంలో బాలిక మృతి

Apr 2 2026 7:47 AM | Updated on Apr 2 2026 7:47 AM

ప్రమాదంలో బాలిక మృతి ● న్యాయం చేయాలని కలెక్టర్‌కు వినతి

● న్యాయం చేయాలని కలెక్టర్‌కు వినతి

తిరువళ్లూరు: రోడ్డు నిర్మాణాల కోసం చేపట్టిన తవ్వకాల్లో పడి ప్లస్‌టూ బాలిక మృతి చెందిన క్రమంలో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ బంధువులు మంగళవారం ఉదయం కలెక్టరేట్‌లో వినతి పత్రం సమర్పించారు. తిరువళ్లూరు– ఊత్తుకోట మార్గంలో రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. విస్తరణ పనుల కోసం చేపట్టిన తవ్వకాల్లో ప్లస్‌టూ విద్యార్థిని ప్రమాదవశాత్తు పడి మృతిచెందింది. ఈ క్రమంలో బాధిత కుటుంబానికి పరిహారం చెల్లించడంతో పాటు రోడ్డు విస్తరణ పనుల్లో ముందుస్తు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాంట్రాక్టర్‌, ఆర్‌అండ్‌బీ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హైకోర్టు న్యాయవాది మణిమారన్‌ నేతృత్వంలోని పలువురు కలెక్టరేట్‌లో వినతి పత్రం సమర్పించారు. రోడ్డు విస్తరణ పనుల కోసం చేపట్టిన తవ్వకాల వద్ద హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయకపోవడం వల్ల ప్రమాధం జరిగిందని ఆరోపించారు. అధికారులు, కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవడంతో పాటు బాలిక కుటుంబానికి పరిహారం చెల్లించాలని వినతి పత్రం సమర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement