క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Apr 2 2026 7:47 AM | Updated on Apr 2 2026 7:47 AM

చెస్‌ ఆర్బిటర్‌గా వేలూరు విద్యార్థి ఎంపిక గెలిచేందుకు సమష్టిగా పనిచేయండి విద్యుదాఘాతానికి ఇద్దరి మృతి నలుగురు విద్యార్థినులు అదృశ్యం న్యూజిలాండ్‌, ఐఐటీ మద్రాసు మధ్య ఒప్పందం

వేలూరు: తమిళనాడు రాష్ట్ర చెస్‌ అసోషియేన్‌ ఆధ్వర్యంలో చెస్‌ ఆర్బిటర్‌ల కోసం ప్రత్యేక అర్హత పరీక్ష విధంగా అరక్కోణంలో జరిగింది. ఇందులో తమిళనాడు వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల నుంచి మొత్తం 105 మంది చెస్‌ క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పరీక్షల్లో వేలూరుకు చెందిన జీఎస్‌ చెస్‌ క్లబ్‌ కార్యదర్శి సురేష్‌ ఈ పరీక్షల్లో విజయవంతంగా అర్హత సాధించి ఎంపికయ్యారు. ఈయన ఇకపై రాష్ట్ర స్థాయిలో జరిగే చెస్‌ టోర్నమెంట్‌లో ఆర్బిటర్‌గా సేవలందించనున్నారు. దీంతో ఆయనకు రాయవేలూరు చెస్‌ అసోషియేషన్‌ అధ్యక్షుడు మనోహరన్‌, తమిళనాడు చెస్‌ అసోషియేషన్‌ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మణికంఠస్వామి సురేష్‌ ఎంపిక కావడం పట్ల అభినందనలు తెలిపారు.

తిరువళ్లూరు: తిరువళ్లూరు నియోజకవర్గాన్ని డీఎంకే కై వసం చేసుకోవడానికి పార్టీ నేతలు కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని సిట్టింగ్‌ ఎమ్మెల్యే, అభ్యర్థి వీజీ రాజేంద్రన్‌ సూచించారు. తిరువళ్లూరులోని డీఎంకే జిల్లా కార్యాలయంలో పార్టీ నేతలు, కూటమి నేతలతో రౌండ్‌టేబుల్‌ సమావేశాన్ని మంగళవారం ఉదయం ఏర్పాటు చేశారు. సమావేశానికి జిల్లా కన్వీనర్‌ తిరుత్తణి చంద్రన్‌ అధ్యక్షత వహించి పార్టీ గెలుపు కోసం నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఆయన సూచించారు. గత ఐదేళ్లలో డీఎంకే చేసిన అభివృద్ధి, ఎన్నికల మ్యాని ఫెస్టోను ప్రజలకు వివరించి ప్రచారం చేయా లని సూచించారు. పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

అన్నానగర్‌: విద్యుదాఘాతానికి ఒద్దరు మహిళలు మృతిచెందారు. కోయంబత్తూరు జిల్లా, నేగమం సమీపంలోని పానపట్టికి చెందిన శాంతి(41). ఈమె సొంతంగా అదే ప్రాంతంలో కోళ్లఫారమ్‌ నడుపుతుంది. ఈ స్థితిలో బుధవారం తన కోళ్ల ఫారాన్ని నీటితో శుభ్రం చేస్తుండగా అనుకోకుండా విద్యుదాఘాతానికి గురైంది. ఇది చూసి దిగ్భ్రాంతి చెందిన ఆమె బంధువు తమిళరసి(26), శాంతిని కాపాడడానికి ప్రయత్నించగా, ఆమె కూడా విద్యుదాఘాతానికి గురై కింద పడిపోయింది. ఇరుగుపొరుగు వారిద్దరిని రక్షించి పొల్లాచి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు వారిద్దరూ మృతిచెందినట్లు ప్రకటించారు. నేగమం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తిరువొత్తియూరు: కోయంబత్తూరు ఆత్తుపాలెం వద్ద ఉన్న కురిచి డివిజన్‌ నుంచి పోత నూర్‌ వెళ్లే రోడ్డులో నివాస ప్రాంతం ఉంది. ఈ ప్రాంతానికి చెందిన నలుగురు అదే ప్రాంతంలో ఉన్న ఒక ప్రైవేట్‌ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నారు. ఈ పరిస్థితిలో, మంగళవారం సాయంత్రం ఇంట్లో ఉన్న నలుగురు విద్యార్థినులు అకస్మాత్తుగా అదృశ్యమయ్యారు. తల్లిదండ్రులు పోతనూర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈక్రమంలో తప్పిపోయిన నలుగురు బాలికలు కోవై రైల్వేస్టేషన్‌లో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే పోలీసులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి వెళ్లడంతో పోలీసులు వారికి పిల్లలను అప్పగించారు.

సాక్షి, చైన్నె: న్యూజిలాండ్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్‌ కాంటర్బరీ, ఐఐటీ మద్రాసు మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఈ భాగస్వామ్యం ద్వారా ఐఐటీ మద్రాస్‌ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు సరికొత్త మార్గాలు సుగమమయ్యాయి. ఐఐటీ మద్రాస్‌ విద్యార్థులకు న్యూజిలాండ్‌లో మాస్టర్స్‌ అవకాశం కల్పించనున్నారు. ఐఐటీ మద్రాస్‌లో బీఎస్‌ డిగ్రీ పూర్తి చేసి, అవసరమైన విద్యా ప్రమాణాలు కలిగిన విద్యార్థులు న్యూజిలాండ్‌లో పీజీ చేయడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థులతో పాటు అధ్యాపకుల మార్పిడి, సంయుక్త పరిశోధనలు, సెమినార్లు మరియు కాన్ఫరెన్స్‌ల నిర్వహణకు ఈ ఒప్పందం వీలు కల్పిస్తుంది. ఐఐటీ మద్రాస్‌లోని సెంటర్‌ ఫర్‌ అవుట్‌రీచ్‌ అండ్‌ డిజిటల్‌ ఎడ్యుకేషన్‌ ఈ భాగస్వామ్య కార్యక్రమాలను పర్యవేక్షించే నోడల్‌ కేంద్రంగా వ్యవహరిస్తుందని ప్రకటించారు. ఐఐటీ మద్రాసు ప్రొఫెసర్‌ ప్రతాప్‌ హరిదాస్‌, న్యూజిలాండ్‌ వర్సిటీ ప్రొఫెసర్‌ మైఖెల్‌ గ్రిమ్లీ ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement