వందశాతం పోలింగ్‌పై అవగాహన | - | Sakshi
Sakshi News home page

వందశాతం పోలింగ్‌పై అవగాహన

Apr 2 2026 7:47 AM | Updated on Apr 2 2026 7:47 AM

వేలూరు: అసెంబ్లీ ఎన్నికల్లో వందశాతం పోలింగ్‌ చేపట్టాలని కోరుతూ జిల్లా వ్యాప్తంగా వివిధ శాఖల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కరపత్రాలు అందజేయడం, ముగ్గులు వేసి అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా వేలూరు కార్పొరేషన్‌ మొదటి జోన్‌ పరిధిలోని అసిస్టెంట్‌ కమిషనర్‌ బాలమురుగన్‌ అధ్యక్షతన వందశాతం పోలింగ్‌పై పారిశుధ్య కార్మికులు, కార్పొరేషన్‌ సిబ్బందిచే ముగ్గులు వేసి కరపత్రాలు అందజేసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఈనెల 23న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వేలూరు జిల్లా వందశాతం పోలింగ్‌ జరగాలన్నారు. వంద శాతం పోలింగ్‌కు ప్రతిఒక్కరూ కంకణం కట్టుకోవాలన్నారు. అనంతరం పారిశుధ్య కార్మికులతో వందశాతం పోలింగ్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 18 సంవత్సరాలు నిండిన వారందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. కార్పొరేషన్‌ ఆరోగ్యశాఖ అధికారి శివకుమార్‌, కాట్పాడి జోన్‌ డిప్యూటీ తహసీల్దార్‌లు మురుగన్‌, సుజాత, కార్పొరేషన్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement