రోడ్డెక్కిన.. లగ్జరీ బస్సులు | - | Sakshi
Sakshi News home page

రోడ్డెక్కిన.. లగ్జరీ బస్సులు

Dec 25 2025 8:17 AM | Updated on Dec 25 2025 8:17 AM

రోడ్డ

రోడ్డెక్కిన.. లగ్జరీ బస్సులు

● రూ. 34.30 కోట్లతో కొనుగోలు ● జెండా ఊపిన సీఎం స్టాలిన్‌

సాక్షి, చైన్నె: ప్రభుత్వ ఎక్స్‌ప్రెస్‌ ట్రానన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌కు రూ. 34.30 కోట్ల విలువైన 20 లగ్జరీ బస్సులను కొనుగోలు చేశారు. అత్యాధునిక రిఫ్రిజిరేటెడ్‌ లగ్జరీ యాక్సిల్స్‌తో (మల్టీ–ఆక్సిల్‌) కూడిన ఎయిర్‌ కండిషన్డ్‌ లగ్జరీ బస్సులకు బుధవారం సీఎం ఎంకే స్టాలిన్‌ జెండా ఊపారు. వివరాలు.. రాష్ట్రరోడ్డు రవాణా సంస్థ బస్సులను ప్రైవేటు ఆమ్నీకి ధీటుగా తీర్చిదిద్దే పనిలో అధికారులు నిమగ్నమైన విషయం తెలిసిందే. స్లీపర్‌ సేవలతో కూడిన బస్సులను సైతం రంగంలోకి దించి ఉన్నారు. ప్రైవేటుకు ధీటుగా సేవలు, సకాలంలో గమ్యస్థానాలకు చేర్చడం వంటి కార్యాచరణను వేగవంతం చేశారు. తాగా ప్రభుత్వ ఎక్స్‌ప్రెస్‌ రవాణా సంస్థలో ఆధునిక సాంకేతికతతో కూడిన మల్టీ–ఆక్సిల్‌ అత్యాధునిక ఎయిర్‌ కండిషనింగ్‌తో కూడిన 20 కొత్త బస్సులు కొనుగోలు చేశారు. ప్రయాణీకులకు అధికనాణ్యత , సౌకర్యవంతమైన సీటింగ్‌ అమరిక, మొబైల్‌ ఛార్జింగ్‌ పోర్టులు, మ్యాగజైన్‌, బాటిల్‌ హోల్డర్‌, షూరాక్‌ తదితర అనేక ఏర్పాట్లు, సురక్షితమైన డ్రైవర్‌ క్యాబిన్‌, అధునాతన బ్రేకింగ్‌, భద్రతా వ్యవస్థలతో ఈ బస్సులను సిద్ధం చేశారు. ఎలక్ట్రానిక్‌ డయాగ్నస్టిక్‌ కంట్రోల్‌ సౌకర్యం, రివర్స్‌ సెన్సార్‌తో వాహనాన్ని పర్యవేక్షించడానికి సౌకర్యం, సీసీ కెమెరాతో కూడిన బస్‌ ట్రాకింగ్‌ వ్యవస్థ కూడా పొందు పరిచారు. చైన్నెలో జరిగిన కార్యక్రమంలో ఈ బస్సులకు సీఎం స్టాలిన్‌జెండా ఊపారు.ఆ బస్సులలో ఉన్న సౌకర్యాలను, సేవలను పరిశీలించారు. అనంతరం తమిళనాడు ప్రభుత్వం రాష్ట్ర రవాణా సంస్థలను ప్రారంభించి 50వ సంవత్సరం (1976) అవుతోండటంతో స్వర్ణోత్సవాల దృష్ట్యా, రూ. 3.33 కోట్లతో 1,05,778 మంది ఉద్యోగులకు ఈసందర్భంగా గోడ గడియారాల పంపిణీని సీఎం ప్రారంభించారు. ఈ కొత్త బస్సులకు డ్రైవర్లుగా నియమితులైన వారిని అభినందించారు. సురక్షిత ప్రయాణమే లక్ష్యంగా, ప్రయాణికులకు ప్రయోజనకరంగా ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో మంత్రులు స్వామినాథన్‌, శివశంకర్‌, శేఖర్‌బాబు, మేయర్‌ ప్రియ, ఎంపీ ఎ. రాజా, రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు.

పెరియార్‌కు నివాళి..

ముందుగా సిమ్సన్‌లో ద్రవిడ సిద్ధాంతకర్త పెరియార్‌ 52వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి డిప్యూటీ సీఎం ఉదయనిఽధి స్టాలిన్‌, మంత్రులు టీఆర్‌బీ రాజ, స్వామినాథన్‌, శేఖర్‌బాబు, ఎంపీ రాజలతో కలిసి సీఎం స్టాలిన్‌ నివాళులర్పించారు. పెరియార్‌ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సీఎం స్టాలిన్‌ ట్వీట్‌ చేశారు. ఆత్మ గౌరవాన్ని కాపాడుకుంటూ, ఆధిపత్యానికి లొంగిపోకుండా హేతుబద్ధంమైన ఆలోచనలతో , సమానత్వంతో ముందుకెళ్దామన్నారు. పెరియార్‌ను ఎవ్వరూ హైజాక్‌ చేయలేరని పేర్కొన్నారు.

రోడ్డెక్కిన.. లగ్జరీ బస్సులు 1
1/1

రోడ్డెక్కిన.. లగ్జరీ బస్సులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement