కోలాహలం!
రాష్ట్రవ్యాప్తంగా కాంతులీనుతున్న చర్చిలు
నేడు ప్రత్యేక ప్రార్థనలు
అర్ధరాత్రి నుంచే వేడుకలు
పలువురు నేతల శుభాకాంక్షలు
క్రిస్మస్
సాక్షి, చైన్నె: డిసెంబరు 25.. లోక సంరక్షణ కోసం తూర్పున వెలిసిన ధృవతార ఏసు క్రీస్తు జన్మించిన రోజు అన్న విషయం తెలిసిందే. పుట్టుకతోనే పశువుల పాకలో కళ్లు తెరిచినా .. మనిషి జీవిత ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు. దైవ కుమారుడిగా లోకంలో జన్మించి పాపము నిండిన మనుషుల మధ్య సగటు మనిషిగానే జీవించిన ఏసు క్రీస్తు పుట్టిన రోజు గురువారం. క్రీస్తు జన్మదినాన్ని ఘనంగా జరుపుకునేందుకు రాష్ట్రంలోని క్రైస్తవ సోదరులు సిద్ధమయ్యారు. ఇంటి ముందు, లోపల ప్రత్యేకంగా అలంకరించిన క్రిస్మస్ ట్రీ లను ఆకర్షణీయంగా ఉంచారు.
నేతల శుభాకాంక్షలు..
క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని క్రైస్తవ సోదరులకు గవర్నర్ ఆర్‌ఎన్ రవి, సీఎం ఎంకే స్టాలిన్, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి, టీవీకే నేత విజయ్, మాజీ సీఎం పన్నీరు సెల్వం, ఎండీఎంకే నేత వైకో, నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్, తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు సెల్వ పెరుంతొగై, తమిళ మానిల కాంగ్రెస్ నేత జికే వాసన్, పీఎంకే అన్బుమణి, బీజేపీ శరత్‌కుమార్‌లతో పాటూ పలు పార్టీల నేతలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఏసుక్రీస్తు జన్మించిన ఈ శుభదినం రోజున సహోదరతత్వం ,సేవ తత్వం, ప్రేమ, కరుణ పెంపొందాలని ఆక్షాంచించారు. కరుణామయుడు ఏసుక్రీస్తు బోధనల్ని అనుసరించి ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సోదర బావంతో అందరూ ఐక్యమత్యంగా మెలగాలని ఆకాంక్షించారు.
కోలాహలం!
కోలాహలం!
కోలాహలం!
కోలాహలం!


