మహారాజాగా విజయ్‌సేతుపతి | Vijay Sethupathi New Movie Update | Sakshi
Sakshi News home page

Vijay Sethupathi: మహారాజాగా విజయ్‌సేతుపతి

Mar 2 2023 1:28 AM | Updated on Mar 2 2023 9:59 AM

విజయ్‌సేతుపతి  - Sakshi

విజయ్‌సేతుపతి

తమిళసినిమా: కోలీవుడ్‌లో పలు విజయవంతమైన చిత్రాల్లో నటిస్తూ స్టార్‌ హీరోగా రాణిస్తున్న విజయ్‌సేతుపతి. ఆ తరువాత తెలుగులోనూ రంగప్రవేశం చేసి అక్కడ విలక్షణ నటుడిగా గుర్తింపు పొందుతూ తాజాగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. అక్కడ వెబ్‌ సీరీస్‌లో నటిస్తూ పాన్‌ ఇండియా నటుడు స్థాయికి చేరుకున్నారు. ఈయన నటించిన మామణిదన్‌ చిత్రం విమర్శకులను సైతం మెప్పించి, పలు అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది. కాగా విజయ్‌సేతుపతి తాజాగా తమిళంలో నూతన చిత్రానికి సంతకం చేశారని, దీనికి మహారాజా అనే టైటిల్‌ నిర్ణయించినట్లు సమాచారం.

దీనికి కురంగు బొమ్మై చిత్రం ఫేమ్‌ నిథిలన్‌ స్వామినాథన్‌ దర్శకత్వం వహించనున్నట్లు తెలిసింది. ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టెయిన్‌ కథా చిత్రంగా తెరకెక్కనున్న ఇందులో నటుడు నటరాజన్‌ ముఖ్యపాత్రను పోషించనున్నట్లు, ప్రస్తుతం విజయ్‌సేతుపతి పాన్‌ ఇండియా ఇమేజ్‌ను తెచ్చుకోవడంతో ఈ మహారాజా చిత్రాన్ని పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. కాగా విజయ్‌సేతుపతి దర్శకుడు, నటి నయనతార భర్త విగ్నేశ్‌ శివన్‌ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలోనూ నటించడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement