ఏఐకేఎస్‌ మహాసభలను జయప్రదం చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఏఐకేఎస్‌ మహాసభలను జయప్రదం చేయాలి

Nov 12 2026 5:30 AM | Updated on Nov 12 2026 5:30 AM

సూర్యాపేట(సూర్యాపేట అర్బన్‌) : నల్లగొండలో ఈనెల 15 నుంచి 18 వరకు నిర్వహించనున్న అఖిల భారత కిసాన్‌ సభ (ఏఐకేఎస్‌) 36వ జాతీ య మహాసభలను జయప్రదం చేయాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి పిలుపునిచ్చారు. మహాసభల వాల్‌పోస్టర్‌ను సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకటనరసింహారెడ్డి భవన్‌లో బుధవారం ఆమె ఆవిష్కరించి మాట్లాడారు. మహాసభల్లో భాగంగా 15న నల్లగొండ ఎన్జీ కళాశాల మైదానంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు రైతాంగం లక్షలాదిగా తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లు నాగార్జునరెడ్డి, చేతివత్తిదారుల సమన్వయ కమిటీ జిల్లా నాయకులు నాగారపు పాండు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు, కేవీపీఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి, మద్దెల జ్యోతి, వేల్పుల వెంకన్న, బొమ్మిడి లక్ష్మీనారాయణ, నాగిరెడ్డి శేఖర్‌రెడ్డి, మేరెడ్డి కృష్ణారెడ్డి, చిట్లంకి యాదగిరి, పిండిగా నాగమణి, మామిడి సుందరయ్య, నందిపాటి సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement