పంచాయతీకో వెబ్‌సైట్‌ | - | Sakshi
Sakshi News home page

పంచాయతీకో వెబ్‌సైట్‌

Nov 20 2026 2:30 AM | Updated on Nov 20 2026 2:30 AM

పెన్‌పహాడ్‌ : గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. గ్రామాల్లోని ప్రజల అవసరాలను గుర్తించి అందుకు అనుగుణంగా మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని నిర్ణయించింది. ఇందుకోసం తెలంగాణ రైజింగ్‌ 2047 లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి పంచాయతీకి ప్రత్యేకంగా ఒక వెబ్‌సైట్‌ను రూపొందించనున్నారు. గ్రామాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించి ఇందులో నమోదు చేయాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియ అమలుకు అధికారులు చర్యలు ప్రారంభించారు.

నిరంతరం పర్యవేక్షణకు..

అభివృద్ధి ప్రణాళికల అమలులో పారదర్శకతకు పెద్దపీట వేయనున్నారు. ప్రతినెలా చేపట్టిన పనులు, వాటి పురోగతి, వినియోగించిన నిధులు, పూర్తిచేసిన లక్ష్యాల వివరాలను సంబంధిత వెబ్‌సైట్‌లో నమోదు చేయనున్నారు. మండల స్థాయిలో ఎంపీడీఓలు, జిల్లా స్థాయిలో కలెక్టర్లు ఈ ప్రక్రియను పర్యవేక్షించనున్నారు. దీంతో పనుల అమలుపై నిరంతరం పర్యవేక్షణ సాధ్యవమతుందని అధికారులు భావిస్తున్నారు. వచ్చే ఐదేళ్లలో గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలకు ముందుగానే ప్రణాళిక రూపొందించనున్నారు. తాగునీటి సమస్యల పరిష్కారం కోసం, వ్యవసాయ రంగం బలోపేతం, చెరువుల అభివృద్ధి, సాగునీటి వనరుల పెంపు, స్థానికంగా ఉపాధి కల్పన, వలసల నియంత్రణ వంటి అంశాలను కార్యాచరణలో చేర్చనున్నారు. గ్రామ అవసరాలకు అనుగుణంగా పనులను ప్రాధాన్యక్రమంలో చేపట్టనున్నారు.

గ్రామ వివరాలు ఆన్‌లైన్‌లోనే..

ప్రభుత్వ నూతన కార్యాచరణ ప్రకారం ప్రతి మండలంలో ప్రతి గ్రామ పంచాయతీకి ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ అందుబాటులోకి తీసుకు రానున్నారు. గ్రామ జనాభా రైతుల వివరాలు, సాగు భూములు, పంటల విస్తీర్ణం, గృహాల పరిస్థితి, భూమిలేని కూలీల సంఖ్య, ఉపాధి అవకాశాలు, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు పశు సంపద, గ్రామ ఆస్తులు, మౌలిక సదుపాయాల సంబంధించిన సమాచారాన్ని అందులో ఈ వెబ్‌సైట్‌లో నమోదు చేయనున్నారు.

పనుల్లో పారదర్శకత కోసమే..

ఇక గ్రామాల్లో పనులకు సంబంధించిన వివరాలు వెబ్‌సైట్‌లోనే ఉంటాయి. పనుల్లో పారదర్శకత, పరిపాలన ప్రజలకు చేరువ చేసేందుకు వివరాలు ఆన్‌లైన్‌లో నమోదవుతాయి.

– రాజేశ్వర్‌ ఎంపీఓ, పెన్‌పహాడ్‌

పల్లెలకు సాంకేతిక సొబగులు

ప్రత్యేక సైట్‌లోనే గ్రామ

వివరాలన్నీ నమోదు

వచ్చే ఐదేళ్లలో అభివృద్ధికి ప్రణాళికలు

తెలంగాణ రైజింగ్‌–2047

లక్ష్యాల సాధనకు శ్రీకారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement