నీటి వనరులను సమర్థంగా వినియోగిస్తాం | - | Sakshi
Sakshi News home page

నీటి వనరులను సమర్థంగా వినియోగిస్తాం

Nov 20 2026 2:30 AM | Updated on Nov 20 2026 2:30 AM

హుజూర్‌నగర్‌ : మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల సమస్యలను సరిదిద్ది సాగునీటి వనరులను సమర్థవంతంగా వినియోగిస్తామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. గురువారం హుజూర్‌నగర్‌లోని కౌండిన్య ఫంక్షన్‌ హాల్‌లో నియోజకవర్గ పరిధిలో నూతనంగా చేయూత పింఛన్లు మంజూరైన వారికి పత్రాలు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌, సీఎంఆర్‌ఎఫ్‌ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు. నియోజకవర్గంలో అన్నిరకాల పింఛన్లకు సంబంధించి మొత్తం 43,113 మంది లబ్ధిదారులకు నెలకు రూ11.13 కోట్ల చొప్పున ఏటా రూ.133.56 కోట్లు చెల్లిస్తామన్నారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతిఒక్కరికీ సంక్షేమ పథకాలు వర్తింపజేస్తామన్నారు. ఇందిరమ్మ కుటుంబ బీమా పేరుతో మరో కొత్త పథకానికి నాంది పలుకుతున్నామని పేర్కొన్నారు. రాబోయే వేసవిలో తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని నీటి సంరక్షణ చర్యలు చేపడతామన్నారు. ఈ పథకంలో భాగంగా బీమా ఉన్న వ్యక్తి మరణిస్తే వారి కుటుంబానికి రూ.5 లక్షలు అందిస్తామన్నారు. ఈ సందర్బంగా మంత్రిని గజమాలతో సన్మానించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌, ఎస్‌పీ నరసింహ, రాష్ట్ర పెరిక కార్పొరేషన్‌ చైర్మన్‌ దొంగరి వెంకటేశ్వర్లు, దివ్యాంగుల కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ ముత్తినేని వీరయ్య, ఏఎంసీ చైర్మన్‌ డి.రాధిక, మున్సిపల్‌ చైర్మన్లు దొంతగాని శ్రీనివాస్‌, కొణతం వెంకటరెడ్డి, వైస్‌ చైర్మన్లు తన్నీరు మల్లికార్జున్‌, నూకల సందీప్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ వంగవీటి రామారావు, డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నరసయ్య, ఆర్డీఓ శ్రీనివాసులు, డీఆర్‌డీఓ సన్యాసయ్య, మున్సిపల్‌ కమీషనర్లు సతీష్‌ కుమర్‌, సీహెచ్‌.నాగరాజు, మాజీ ఎంపీపీ గూడెపు శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

అర్హులందరికీ పింఛన్లు ఇస్తాం

మంత్రి నలమాద ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement