రీ సర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

రీ సర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం

Nov 20 2026 2:30 AM | Updated on Nov 20 2026 2:30 AM

అర్వపల్లి : భూముల రీ సర్వే కార్యక్రమంతో భూ సమస్యలు శాశ్వతంగా పరిష్కారం కానున్నాయని జిల్లా అదనపు కలెక్టర్‌ హరిసింగ్‌ చెప్పారు. జాజిరెడ్డిగూడెం గ్రామపంచాయతీ ఆవాసం కేసారంలో పైలెట్‌ ప్రాజెక్ట్‌ కింద జరుగుతున్న రీ సర్వే పనులను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తమ భూ సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్వే ఏడీ శ్రీనివాస్‌రెడ్డి, డీఐ ప్రకాష్‌, తహసీల్దార్‌ భాషపాక శ్రీకాంత్‌, సర్వేయర్‌ వెంకటేష్‌, జీపీఓ అజయ్‌, లైసెన్స్‌డ్‌ సర్వేయర్‌ సైదులు, సోమన్న, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement