అమ్మకానికీ అవస్థలే..! | - | Sakshi
Sakshi News home page

అమ్మకానికీ అవస్థలే..!

Nov 20 2026 2:30 AM | Updated on Nov 20 2026 2:30 AM

తిరుమలగిరి (తుంగతుర్తి): ఆరుగాలం కష్టించి వరిధాన్యం పండించిన రైతులకు దాన్ని అమ్ముకుంనేందుకు నానా అవస్థలు పడుతున్నారు. తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్‌ యార్డులో గురువారం ఈ పరిస్థితి నెలకొంది. నెల రోజులుగా వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు రైతులు భారీగా ధాన్యం తెస్తున్నారు. ఇప్పటికి ఈ సీజన్‌లో 4.50 లక్షల బస్తాల ధాన్యం వచ్చింది. మార్కెట్‌కు పెద్ద ఎత్తున ధాన్యం వస్తుండడంతో కాంటాలు ఆలస్యం అవుతున్నాయి. ఎగుమతుల్లోనూ జాప్యం జరుగుతోంది. దీంతో మార్కెట్‌ అధికారులు పది రోజులుగా టోకెన్‌ విధానాన్ని అమలు చేస్తున్నారు. ప్రతిరోజూ 15 వేల బస్తాల అమ్మకానికి రైతులకు టోకెన్లు ఇస్తున్నారు. గురువారం కేవలం 7వేల బస్తాలకే టోకెన్లు ఇవ్వడంతో రైతు ఇబ్బందులు పడ్డారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన రైతులకు టోకెన్లు లేకపోవడంతో మార్కెట్‌ ఎదుట సూర్యాపేట–జనగాం ప్రధాన రహదారికి ఇరువైపులా ధాన్యం ట్రాక్టర్లతో బారులుదీరారు.

కొనుగోలు కేంద్రాలు లేక..

ఈ సీజన్‌లో ప్రారంభంలో బహిరంగ మార్కెట్‌లో సన్న, దొడ్డు ధాన్యానికి మంచి ధరలు పలికాయి. అయితే నియోజకవర్గంలో ఇప్పటివరకు ఎక్కడా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో రైతులు మార్కెట్‌కే ధాన్యం తెస్తున్నారు. తుపాను ప్రభావానికి భయపడుతున్న కొందరు రైతులు ప్రైవేట్‌ వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. ఇప్పటికై నా సంబంధిత శాకల అధికారులు స్పందించి అన్ని గ్రామాల్లో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ధాన్యం కొనాలని రైతులు కోరుతున్నారు.

తిరుమలగిరి మార్కెట్‌కు వెల్లువలా ధాన్యం

రోడ్డుకు ఇరువైపులా

బారులుదీరిన ట్రాక్టర్లు

గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు

ప్రారంభించకపోవడమే కారణం

రోజూ టోకెన్లు ఇవ్వాలి

తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్‌లో 20 వేల బస్తాల వరకు ధాన్యం అమ్ముకునేందుకు రైతులకు ప్రతిరోజూ టోకెన్లు ఇచ్చేలా చూడాలి. లేదంటే గ్రామాల్లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి త్వరితగతిన కాంటాలు జరిగేలా చూడాలి.

– నరసింహా, రైతు, తొండ,

తిరుమలగిర మండలం

ఇబ్బందులు పడుతున్నాం..

ధాన్యం అమ్ముకోవాలంటే నానా ఇబ్బందులు ౖ రెతులు పడాల్సి వస్తోంది. తుపాను వస్తుందని భయంతో అందరూ ఒకేసారి కోతలు కోస్తున్నారు. టోకెన్‌తో సంబంధం లేకుండా రైతులు మార్కెట్‌లో ధాన్యం అమ్ముకునే విధంగా తగిన చర్యలు తీసుకోవాలి.

– యాదగిరి, రైతు, ముత్తారం,

తిరుమలగిరి మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement