మెరుగైన ఫలితాలు సాధించాలి | - | Sakshi
Sakshi News home page

మెరుగైన ఫలితాలు సాధించాలి

Nov 20 2026 2:30 AM | Updated on Nov 20 2026 2:30 AM

గరిడేపల్లి : విద్యార్థులు కష్టపడి చదివి మెరుగైన ఫలితాలు సాధించాలని జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారి (డీఐఈఓ) సులోచనరాణి అన్నారు. గురువారం గరిడేపల్లి మండలం గడ్డిపల్లి పీఎంశ్రీ మోడల్‌ స్కూల్‌, జూనియర్‌ కళాశాలను సందర్శించి మాట్లాడారు. విద్యార్థుల్లో మనోధైర్యాన్ని నింపుతూ, అధ్యాపకులకు తగిన సూచనలు చేయాలన్నారు. అనంతరం ప్రాక్టికల్స్‌పై పలు సూచనలు చేశారు. ఆమె వెంట కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జె.ప్రసన్నకుమారి, డి.నాగరాజు, సతీష్‌ కుమార్‌, శైలజ, వీరభద్రం, వెంకటేశ్వర్లు, చిన్న బాలయ్య, విష్ణువర్ధన్‌, శ్రవణ్‌ కుమార్‌, శాంతి ప్రియ, డాక్టర్‌ కందుల శివకృష్ణ, దామ్లా, మల్లికార్జున్‌రెడ్డి, అనిల్‌, రాజేష్‌, శ్రీను తదితరులు ఉన్నారు.

శాస్త్రోక్తంగా

నిత్య కల్యాణం

మఠంపల్లి : మట్టపల్లి క్షేత్రంలో గురువారం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు, పంచామృతాభిషేకం చేశారు. అనంతరం ఎదుర్కోలు మహోత్సవం పూర్తి చేసి నిత్య కల్యాణం జరిపారు. నీరాజన మంత్ర పుష్పం తదుపరి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌ కుమార్‌, దేవాలయ ఈఓ చలపతిరావు, అర్చకులు శ్రీనివాసాచార్యులు, పద్మనాభచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, నవీన్‌కుమారాచార్యులు పాల్గొన్నారు.

కేస్‌ ప్రజెంటేషన్‌తో క్లినికల్‌ నైపుణ్యాలు పెంపు

సూర్యాపేటటౌన్‌ : వైద్య విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, క్లినికల్‌ పరిజ్ఞానం, వైద్య నైపుణ్యాలను పెంపొందించేందుకు కేస్‌ ప్రజెంటేషన్‌ కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని సూర్యాపేట ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రవణ్‌ కుమార్‌ అన్నారు. సూర్యాపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యార్థుల ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన కేస్‌ ప్రజెంటేషన్‌ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 2022, 2023, 2024, 2025 బ్యాచ్‌లకు చెందిన వైద్య విద్యార్థులు వివిధ వైద్య కేసులను విశ్లేషిస్తూ తమ ప్రతిభను ప్రదర్శించారని తెలిపారు. ప్రతిభ కనబర్చిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement