గరిడేపల్లి : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి మెరుగుపర్చడం ప్రభుత్వ బాధ్యత అని, ఉపాధ్యాయ సంఘాల కృషితోనే పాఠశాలలకు ఉచిత విద్యుత్, విద్యార్థులకు బూట్లు, సాక్సులు వంటి సౌకర్యాలు లభిస్తున్నాయని ఎస్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సదానందం గౌడ్ అన్నారు. బుధవారం రాయినిగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎస్‌టీయూ, ప్రాణక్ హీలింగ్ యోగా సంస్థ సంయుక్త సహకారంతో 22 మంది పదో తరగతి విద్యార్థులకు సమకూర్చిన రూ.5,500 పరీక్ష ఫీజును నగదు రూపంలో స్కూల్ హెచ్‌ఎం నాగమణికి అందించి మాట్లాడారు. మండలంలోని 8 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 250 పేద విద్యార్థులకు దాతల చేయూతతో పరీక్ష ఫీజు నిమిత్తం రూ.60 వేల సహాయం అందేలా చేసిన ఎస్‌టీయూ నాయకుడు పాలూరు అంజయ్య కృషిని అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నాగమణి, పద్మ, ఎస్‌టీయూ నాయకులు కేవీ.సత్యనారాయణ, కె.వీరరాఘవులు, పిట్టల నాగేశ్వరరావు, మీసాల నరసింహారావు, జానకిరెడ్డి, హరిలాల్ శశికళ, విజయనిర్మల, ప్రదీప్, ఉష తదితరులు పాల్గొన్నారు.
ఫ ఎస్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సదానందం గౌడ్


