చివ్వెంల(సూర్యాపేట) : విద్యార్థులు శాసీ్త్రయ విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని జిల్లా విద్యా శాఖ అధికారి (డీఈఓ) సీహెచ్.శ్రీనివాస్‌రావు అన్నారు. బుధవారం చివ్వెంల మండలం దురాజ్‌పల్లి గ్రామ శివారులోని ఎంఎస్ఆర్ సెంట్రల్ పాఠశాలలో నిర్వహించిన 32వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్–2026 పోటీలను తిలకించి మాట్లాడారు. నిత్య జీవితంతో ఎదురయ్యే ఎన్నో సమస్యలకు సైన్స్ ప్రయోగాలు పరిష్కారం చూపిస్తాయన్నారు. విద్యార్థుల్లో పరిశోధన నైపుణ్యాలు, సృజానాత్మక ఆలోచనలు రేకెత్తడానికి, ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. ఈ పోటీల్లో ప్రభుత్వ, ప్రైవేల్ పాఠశాలలకు చెందిన సుమారు 62 మంది విద్యార్థులు తమ ఎగ్జిబిట్లను ప్రదర్శించారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు డీఈఓ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి ఎల్.దేవరాజ్, బాలల సైన్స్ కాంగ్రెస్ జిల్లా అకడమిక్ కోఆర్డినేటర్ జిలకర శ్రీనివాస్, ప్రిన్సిపాల్ టి.లక్ష్మీరాజం, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఫ డీఈఓ శ్రీనివాస్‌రావు


