హుజూర్‌నగర్(పాలకవీడు) : మండలంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని నీటిపారుదల శాఖ మంతి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం పాలకవీడు మండలం జాన్‌పహాడ్ సమీపంలోని కృష్ణానదిపై నిర్మిస్తున్న సాగునీటి లిఫ్ట్ పనులను పరిశీలించి మాట్లాడారు. ఈ లిప్ట్ ద్వారా 10వేల ఎకరాలు, బెట్టెతండా వద్ద మూసీనదిపై నిర్మిస్తున్న చెక్‌డ్యాం, లిఫ్ట్ ద్వారా 2 వేల ఎకరాలు సాగులోకి వస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంపీ రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ నాగభూషణం, నాయకులు కాంగ్రెస్‌పార్టీ మండల అధ్యక్షుడు ఎన్‌వీ.సుబ్బారావు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాళోతు మోతీలాల్, మాజీ ఎంపీపీ భూక్యా గోపాల్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సప్పిడి నాగిరెడ్డి, మునగాల భాస్కర్‌రెడ్డి, తీగల శేషురెడ్డి తదితరులు పాల్గొన్నారు.


