కోదాడరూరల్ : రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తున్నామని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.వెంకట్‌రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలో నిర్వహించిన సంఘం జిల్లా కార్యవర్గ ఆత్మయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నగదు రహిత వైద్యసేవలపై అపోహలు పెట్టుకోవద్దన్నారు. పీఆర్సీ బకాయిలు చెల్లించి, రిటైర్డ్మెంట్ బెన్ఫిట్స్ వెంటనే చెల్లిస్తే రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వానికి సహకరిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సంఘం రెండున్నర లక్షల సభ్యత్వాలు కలిగి ఉందని, అందరూ ఐక్యంగా ఉంటేనే సమస్యలను పరిష్కరించుకోగలుగుతామన్నారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షుడితో పాటు జిల్లా కార్యవర్గ సభ్యులను సన్మానించారు. కార్యక్రమంలో సంఘ నాయకులు సీతా రామయ్య, శ్రీనివాసరావు, రవీందర్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, ఉస్మాన్‌పాషా, ప్రసాదరావు, శ్రీనివాసరెడ్డి, విద్యాసాగర్, జగన్మోహన్రావు, రఘు వరప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
ఫ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం
రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి


