జాతీయరహదారి వెంట ఆక్రమణ తొలగింపు | - | Sakshi
Sakshi News home page

జాతీయరహదారి వెంట ఆక్రమణ తొలగింపు

Nov 11 2026 3:51 AM | Updated on Nov 11 2026 3:51 AM

సూర్యాపేటటౌన్‌ : రోడ్డు ప్రమాదాల నివారణకు సూర్యాపేట ట్రాఫిక్‌ పోలీసులు మంగళవారం ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు జాతీయ రహదారి–65పై అంజనాపురి చౌరస్తా, కొత్త మార్కెట్‌ చౌరస్తాతో పాటు ఇతర ప్రాంతాల్లో రోడ్డు వెంట ఏర్పాటు చేసిన డబ్బాకొట్లు, బోర్డులను తొలగించారు. జేసీబీ సాయంతో డబ్బాలను, దుకాణాల ఎదుట ఏర్పాటు చేసిన రేకుల షెడ్డులను తొలగించారు. ప్రమాదాలకు కారణమవుతున్న రోడ్డు ఆక్రమణలు, వ్యాపార బోర్డులను తొలగించినట్లు పోలీసులు వెల్లడించారు. అవసరమైన ప్రాంతాల్లో లైటింగ్‌ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. మళ్లీ ఆక్రమిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. రహదారులపై ఇష్టానుసారంగా పార్కింగ్‌ చేయరాదని, ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించే వారిపై జరిమానా విధించడంతో పాటు కేసులు నమోదు చేస్తామని వారు హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement