ప్రశాంతంగా ముగిసిన గణేశ్‌ ఉత్సవాలు | - | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా ముగిసిన గణేశ్‌ ఉత్సవాలు

Sep 26 2026 1:38 AM | Updated on Sep 26 2026 1:38 AM

సూర్యాపేటటౌన్‌ : జిల్లాలో గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన శోభాయాత్రలు ప్రశాంతంగా జరిగాయని ఎస్పీ నరసింహ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా పోలీస్‌శాఖ ముందస్తు ప్రణాళికతో పటిష్ట భద్రత కల్పించినట్లు, రెవెన్యూ, మున్సిపల్‌, పంచాయతీరాజ్‌, విద్యుత్‌, వైద్య, అగ్నిమాపక తదితర శాఖల సమన్వయంతో ఉత్సవాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. పోలీసులు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా విధుల్లో పాల్గొని శోభాయాత్రలు, నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా పూర్తయ్యేలా కృషి చేశారని తెలిపారు. ఉత్సవాల్లో సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.

బుల్లెట్‌ రైలు కోసం

ఎందాకై నా సిద్ధం

సూర్యాపేట : నేషనల్‌ హైవే మీదుగా బుల్లెట్‌ ట్రైన్‌ను సాధించేందుకు జిల్లా ప్రజలు ఎంతవరకై నా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌ జిల్లా కార్యదర్శి కొత్తపెల్లి శివకుమార్‌ అన్నారు. బుల్లెట్‌ ట్రైన్‌ సాధన రిలే నిరాహార దీక్షలు శుక్రవారం 43వ రోజు కొనసాగాయి. దీక్షలలో మాస్‌ లైన్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉద్యమానికి అన్ని పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు సహకరించాలని, లేని పక్షంలో ప్రజలే వారికి బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. దీక్షలో పార్టీ నాయకులు కొత్తపల్లి రేణుక, పేర్ల నాగయ్య, ఎర్ర అఖిల్‌, గులాం హుస్సేన్‌, శేషగిరి, పద్మ, చంద్రకళ, సంతోషిమాత, పద్మ, శోభ న్‌రెడ్డి, గొడ్డలి నర్సన్న, లింగయ్య, ఐత రాజు వెంకన్న పాల్గొన్నారు. దీక్షలకు పెద్దిరెడ్డి రాజా, ధర్మార్జున్‌, బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కృష్ణారావు, చలమల నరసింహ, వెలుగు వనిత, డేవిడ్‌ కుమార్‌, తదితరులు సంఘీభావం తెలిపారు.

సూర్యాపేట జిల్లాకు

7 అదనపు కోర్టులు

చివ్వెంల(సూర్యాపేట) : రాష్ట్ర వ్యాప్తంగా 200 జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులను మంజూరు చేస్తూ తెలంగాణ రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి బి. పాపిరెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా సూర్యాపేట జిల్లాకు 7 జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులు మంజూరయ్యాయి. సూర్యాపేటకు రెండు, హూజూర్‌నగర్‌కు మూడు, తుంగతుర్తి, కోదాడకు ఒక్కోక్కటి చొప్పున మంజూరయ్యాయి.

జవహార్‌ నవోదయలో అడ్మిషన్లకు దరఖాస్తులు

సూర్యాపేటటౌన్‌ : చలకుర్తిలోని జవహార్‌ నవోదయ విద్యాలయంలో 9వ తరగతిలో లాటరల్‌ ఎంట్రీ ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి కె.అశోక్‌ శుక్రవారం ఒక ప్రకటనలో సూచించారు. అర్హులైన విద్యార్థులు ఈ నెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలని, లాటరల్‌ ఎంట్రీ సెలక్షన్‌ టెస్ట్‌ 2027 ఏప్రిల్‌ 10న నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. జిల్లాలోని అర్హులైన విద్యా ర్థులు వినియోగించుకోవాలని కోరారు.

లక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణం

మఠంపల్లి : మట్టపల్లిలోని రాజ్యలక్ష్మి, చెంచులక్ష్మీ సమేత లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం స్వామివారి నిత్యకల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు, అర్చనలు, మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం చేశారు. అనంతరం విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, రుత్విగ్వరణం, పంచగవ్యప్రాశన, మధుఫర్కపూజ, మాంగ ల్యధారణ, తలంబ్రాలతో కల్యాణోత్సవం వైభవంగా జరిపించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్‌, ఈఓ చలపతి, అర్చకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement