అక్టోబర్‌1నుంచి 31 వరకు మీడియేషన్‌ | - | Sakshi
Sakshi News home page

అక్టోబర్‌1నుంచి 31 వరకు మీడియేషన్‌

Sep 26 2026 1:38 AM | Updated on Sep 26 2026 1:38 AM

చివ్వెంల(సూర్యాపేట) : కక్షిదారులు మధ్యవర్తిత్వం ద్వారా తమ కేసులు పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీశారద సూచించారు. శుక్రవారం జిల్లా కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశాలతో అక్టోబర్‌ 1 నుంచి 31 వరకు మీడియేషన్‌ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా మాధ్యమం ద్వారా కేసులు పరిష్కరించబడుతాయన్నారు. ఇందు కోసం జిల్లాలో 14 మంది శిక్షణ పొందిన న్యాయవాదులను నియమించినట్లు తెలిపారు. వీరి ద్వారా కక్షిదారులు తమ కేసు ఏ దశలో ఉన్నా రాజీ పడవచ్చునన్నారు. ఇరు వర్గాల వారు తమ డిమాండ్లను ఒక అగ్రిమెంట్‌లో రాసుకొని, దానిని సబంధిత కేసు ఉన్న కోర్టులో ఇస్తే, దాని ప్రకారం డిక్రీ ఇస్తారన్నారు. దీని ద్వారా కేసుల సత్వర పరిష్కారంతో పాటు కాలయాపన తగ్గుతుందని, ఆర్థికంగా నష్టపోకుండా ఉంటారని పేర్కొన్నారు. సివిల్‌, క్రిమినలర్‌తో పాటు పరి ష్కారం అయ్యే కేసులను పరిష్కరించుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.భవ్య పాల్గొన్నారు.

మధ్యవర్తుల ద్వారా కేసుల పరిష్కారం

జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీశారద

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement