హుజూర్‌నగర్ : న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ సాముల రాంరెడ్డి అన్నారు. బార్ కౌన్సిల్ చైర్మన్‌గా ఎన్నికైన అనంతనం ఆయన శుక్రవారం తొలిసారి హుజూర్‌నగర్‌కు వచ్చిన సందర్భంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన అభినందన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర బార్ కౌన్సిల్‌ను అభివృద్ధి చేస్తానన్నారు. హుజూర్‌నగర్‌కు మరో రెండు అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని, దాంతో ప్రస్తుతం న్యాయస్థానాల సంఖ్య 9కి చేరిందన్నారు. కోర్టుకు ప్రభుత్వం ఇప్పటికే మంజూరు చేసిన నాలుగు ఎకరాల స్థలానికి అదనంగా మరో రెండు ఎకరాల స్థలం కేటాయించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తన గెలుపునకు కృషిచేసిన న్యాయవాదులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా రెండవ న్యాయమూర్తి డాక్టర్ శివరామ ప్రసాద్, సీనియర్ సివిల్ జడ్జి నక్క శ్యాంసుందర్, అదనపు జూనియర్ సివిల్ జడ్జి షేక్ ఆయేషా సరీన్, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి మాట్లాడుతూ బార్ కౌన్సిల్ చైర్మన్‌గా ఎన్నికైన రాంరెడ్డిని అభినందించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నారపరాజు శ్రీనివాస రావు, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు బొబ్బ కోటిరెడ్డి, కుక్కడపు బాలకృష్ణ, సీనియర్ ఏజీపీ రేణుకాదేవి, బానోతు సురేష్ నాయక్, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు జక్కుల వీరయ్య, కాల్వ శ్రీనివాసరావు, సీఐ చరమందరాజు, ఎస్‌ఐ చలికంటి నరేష్, బార్ అసోసియేషన్ కార్యవర్గం, జిల్లాలోని వివిధ ప్రాంతాల న్యాయవాదులు, స్థానికులు పాల్గొన్నారు.
ఫ రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ సాముల రాంరెడ్డి


