న్యాయవాదులపై దాడికి నిరసన | - | Sakshi
Sakshi News home page

న్యాయవాదులపై దాడికి నిరసన

Sep 25 2026 2:29 AM | Updated on Sep 25 2026 2:29 AM

హుజూర్‌నగర్‌ : హైదరాబాద్‌లోని అత్తాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో మహిళా న్యాయవాది, మరో న్యాయవాదిపై పోలీసులు దాడికి పాల్పడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బార్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు జక్కుల వీరయ్య అన్నారు. ఈ ఘటనకు నిరసనగా గురువారం హుజూర్‌నగర్‌ బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో పోలీసుల దాడులు విపరీతంగా పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. అడ్వకేట్‌ ప్రొటెక్షన్‌ యాక్ట్‌ ప్రకారం దాడికి పాల్పడిన పోలీసులను వెంటనే సస్పెండ్‌ చేయాలని, వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు కె.మాధవరెడ్డి, వి.వెంకట్‌ రెడ్డి, ఎస్‌.రాఘవరావు, చిట్టిపోతుల రమేష్‌, షేక్‌ నాగూర్‌ భాష, గోపినాథ్‌, రామినేని వెంకటేష్‌, ఎం.ఎం. నరసింహారావు, నాగేందర్‌, సాయిరాంగౌడ్‌, చినబాబు తదితరులు పాల్గొన్నారు.

న్యాయవాదుల విధుల బహిష్కరణ

చివ్వెంల (సూర్యాపేట) : హైదరాబాద్‌లోని అత్తాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో న్యాయవాది షేక్‌ అఖీల్‌ జునైద్‌, మహిళా న్యాయవాది ఫిజాషా పట్ల అనుచితంగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ గురువారం సూర్యాపేట బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. న్యాయవాదులతో అనుచితంగా ప్రవర్తించిన పోలీసులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నూకల సుదర్శన్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి తల్లమళ్ల హుస్సేన్‌, సీనియర్‌, జూనియర్‌ న్యాయవాదులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement