సూర్యాపేట : జిల్లా కేంద్రంలో జాతీయ రహదారి 65కు సమాంతరంగా బుల్లెట్ ట్రైన్ మార్గాన్ని సాధించేంత వరకు విశ్రమించేది లేదని సూర్యాపేట పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు స్పష్టం చేశారు. గురువారం సూర్యాపేట ధర్నా చౌక్ వద్ద శ్రీబుల్లెట్ ట్రైన్ సాధన సమితిశ్రీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసన దీక్షలు 42వ రోజుకు చేరుకున్నాయి. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా దీక్షలో పాల్గొన్న వారికి పలువురు సంఘీభావం తెలిపి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికై నా స్పందించి మొదటి అలైన్‌మెంట్‌నే కొనసాగిస్తూ, సూర్యాపేట మీదుగా బుల్లెట్ ట్రైన్ వచ్చేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దీక్షలో చలమల్ల నరసింహ, వెలుగు వనిత, బూర వెంకటేశ్వర్లు, జర్నలిస్టులు, నాయకులు భూపతి రాములు గౌడ్, కందుకూరి యాదగిరి, ఎర్ర అఖిల్, నాగవెల్లి కరుణాకర్, రవీందర్ నాయక్, యర్కచర్ల శోభారాణి, గాలి రామకృష్ణ, తోట లక్ష్మీ నరసింహారావు, పగిళ్ల వెంకన్న కూర్చోగా.. సట్టు నాగయ్య, గుండు శ్రీనివాస్ గౌడ్, నల్లగొండ నాగయ్యలు పాల్గొని సంఘీభావం తెలిపారు.


