వైభవంగా నారసింహుడి నిత్యకల్యాణం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా నారసింహుడి నిత్యకల్యాణం

Sep 25 2026 2:29 AM | Updated on Sep 25 2026 2:29 AM

మఠంపల్లి : మట్టపల్లి ఆలయంలో శ్రీరాజ్యలక్ష్మీ, చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి నిత్యకల్యాణాన్ని గురువారం అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో శ్రీస్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి, మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం గావించారు. కల్యాణ తంతులో భాగంగా విష్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, రుత్విగ్వరణం, పంచగవ్యప్రాశన, మధుపర్క పూజ, మాంగల్యధారణ, తలంబ్రాల ఘట్టాలను ఘనంగా నిర్వహించారు. ఆలయ అనువంశిక ధర్మకర్తలు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్‌, ఈఓ చలపతి, అర్చకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement