తిరుమలగిరి : సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పక్కన
ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామేల్, అధికారులు, నాయకులు
నేరేడుచర్ల : మేడారంలో అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
తిరుమలగిరి (తుంగతుర్తి) : రైతులు సాగు చేసిన పంటలను కాపాడడంతో పాటు రానున్న వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపుతో, పక్కా ప్రణాళికతో పని చేస్తుందని రాష్ట్ర నీటి పారుదల, సివిల్ సప్‌లై శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలో రూ.7 కోట్లతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. రూ.16 కోట్లతో జశ్వంతాపూర్ వాగుపై నిర్మిస్తున్న చెక్ డ్యాం కమ్ బ్రిడ్జి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. తుంగతుర్తి నియోజకవర్గంలోని దేవాదుల ఫేజ్–6 ద్వారా గోదావరి జలాలు వస్తాయని, వీటి కోసం రూ.1000 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. ఈ గోదావరి జలాల ద్వారా 12,500 ఎకరాలకు సాగు, ప్రజలకు తాగు నీరు అందుతుందన్నారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా 65 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. తాటిపాముల గ్రామంలో ఇప్పటికే రూ.27 కోట్లతో పనులు జరుగుతున్నాయన్నారు. తాను అధికారంలో ఉన్నా లేకున్నా గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 4 అంగన్‌వాడీ కేంద్రాలకు రూ.80 లక్షలు మంజూరు చేస్తానన్నారు. బిక్కేరు వాగుపై జానకిపురం వరకు బ్రిడ్జి నిర్మిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్, ఎస్పీ కె.నరసింహ, అదనపు కలెక్టర్ హరిసింగ్, నాయకులు రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి, చెవిటి వెంకన్నయాదవ్, సుదర్శన్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, గ్రామ సర్పంచ్ బోయపల్లి కిషన్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ కొప్పుల వేణారెడ్డి, ఎల్సోజు చామంతి నరేష్, గిరిధర్‌రెడ్డి, ఆర్డీఓ వేణుమాధవరావు, తహసీల్దార్ వినోద్‌కుమార్, ఎంపీడీఓ లాజరస్, తదితరులు పాల్గొన్నారు.
భరోసా కల్పించక.. భయపెడుతున్నారు
నేరేడుచర్ల : ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నందున రైతులకు భరోసా కల్పించాల్సిన ప్రతిపక్ష బీఆర్‌ఎస్ రైతులను భయపెట్టేలా వ్యవహరిస్తుందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. నేరేడుచర్ల మండలంలోని మేడారం గ్రామంలో రూ.26.40 కోట్లతో నిర్మించిన నేరేడుచర్ల–దూపాడు డబుల్ రోడ్డును బుధవారం ఆయన ప్రారంభించారు. అనంతరం రూ. 20 లక్షలతో నిర్మిస్తున్న జానలదిన్నె గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపన, రూ. 33 లక్షలతో నేరేడుచర్లలో నిర్మించిన గ్రంథాలయ భవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా డబుల్ రోడ్డు నిర్మాణంలో ఫత్తేపురం, వైకుంఠాపురం, రామలక్ష్మీపురం, మేడారం, బక్కయ్యగూడెం, నేరేడుచర్ల, దూపాడు ప్రజలకు రవాణా సదుపాయం మెరుగు పడుతుందన్నారు. ఇటీవల కోదాడలో నిర్వహించిన జాబ్‌మేళా విజయవంతమైందని, అభివృద్ధితో పాటు యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించడం తన బాధ్యతే అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కొణతం చిన వెంకట్‌రెడ్డి, వైస్ చైర్మన్ నూకల సందీప్‌రెడ్డి, సర్పంచులు పారుపల్లి సత్యనారాయణ, రహీం, బుర్రి శ్రీనివాస్, నాయకులు పాల్గొన్నారు.
ఫ నీటి పారుదలశాఖ మంత్రి
ఉత్తమ్‌కుమార్‌రెడ్డి


