కొనసాగుతున్న బుల్లెట్‌ రైలు సాధన దీక్షలు | - | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న బుల్లెట్‌ రైలు సాధన దీక్షలు

Sep 24 2026 2:36 AM | Updated on Sep 24 2026 2:36 AM

సూర్యాపేట : జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్‌ వద్ద బుల్లెట్‌ ట్రైన్‌ సాధన అఖిలపక్ష పోరాట కమిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు బుధవారం 41 రోజు కొనసాగాయి. దీక్షలో సామాజిక కార్యకర్తలు కూర్చున్నారు. దీక్షకు పలువురు పట్టణ ప్రముఖులు సంఘీభావం తెలిపారు. సాయంత్రం తెలంగాణ జన సమితి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంట్ల ధర్మార్జున్‌ దీక్షలో కూర్చున్న వారికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప జేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ జాతీయ రహదారి 65కు సమాంతరంగా బుల్లెట్‌ ట్రైన్‌ కారిడార్‌ను అమలు చేయాలని, ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దీక్షలో బుల్లెట్‌ ట్రైన్‌ సాధన సమితి సభ్యులు, సామాజిక వేత్తలు, ప్రజాసంఘాల నాయకులు మండారి డేవిడ్‌ కుమార్‌, రమణాచారి, వెలుగు వనిత, భూపతి రాములు గౌడ్‌, కందుకూరి యాదగిరి, బూర వెంకటేశ్వర్లు, నాగవెల్లి కరుణాకర్‌, యార్కకచర్ల శోభారాణి, నల్లగొండ నాగన్న, రమ్య, ధరావతు రవీందర్‌నాయక్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement