గడువు వారం రోజులే.. | - | Sakshi
Sakshi News home page

గడువు వారం రోజులే..

Sep 24 2026 2:36 AM | Updated on Sep 24 2026 2:36 AM

ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తున్నాం

సూర్యాపేట : ఫార్మర్‌ రిజిస్ట్రీకి మరో వారం రోజులే అవకాశం ఉంది. ఈ నెల 30 వరకు మాత్రమే నమోదుకు అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రైతులు పండించిన పంటల అమ్మకానికి ఫార్మర్‌ రిజిస్ట్రీ తప్పనిసరి కానున్న నేపథ్యంలో గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు ఫార్మర్‌ రిజిస్ట్రీ చేయించుకోని వారిని గుర్తించి పూర్తి చేసుకునేలా విస్తృత ప్రచారం చేస్తున్నారు.

3.20 లక్షల మంది రైతులు

సూర్యాపేట జిల్లాలో 3.20 లక్షల మంది రైతులు పట్టాదారు పాస్‌ పుస్తకాలు కలిగి ఉన్నారు. ప్రతి రైతుకు రిజిస్ట్రేషన్‌ – ఫార్మర్‌ ఐడీని సమకూర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఫార్మర్‌ రిజిస్ట్రీని తీసుకు వచ్చింది. రానున్న రోజుల్లో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న రైతులకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే వ్యవసాయ పథకాలు వర్తించే అవకాశాలు ఉన్నాయి. పలు విడతలుగా ఫార్మర్‌ రిజిస్ట్రీకి ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించగా ఇప్పటివరకు జిల్లాలో 77 శాతం మంది రైతులు వ్యవసాయ శాఖ అధికారుల వద్ద తమ పేర్లను నమోదు చేయించుకున్నారు.

తప్పనిసరి కావడంతో...!

గతంలో ఫార్మర్‌ రిజిస్ట్రీ కోసం రైతులు ఏఈఓల వద్దకు వెళ్లాల్సి వచ్చేది. ఆధార్‌ కార్డును తీసుకొని వెళ్తే ఫోన్‌కు వచ్చే ఓటీపీ ద్వారా రిజిస్ట్రీని పూర్తిచేసే వారు. దాంతో దూర ప్రాంతాల్లో ఉండే రైతులు, చిన్న, సన్నకారు రైతులు పెద్దగా ఆసక్తి చూపలేదు. దానికి తోడు ఫార్మర్‌ రిజిస్ట్రీ రైతులకు పెద్దగా ఉపయోగపడక పోవడంతో అంతగా పట్టించుకోలేదు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఎరువుల కొనుగోలుకు తీసుకువచ్చిన శ్రీఫ్రేమ్‌ వర్క్‌ ఫర్‌ పేల్‌ యాప్‌లోశ్రీ ఫార్మర్‌ రిజిస్ట్రీ ఆప్షన్‌ ఉండడంతో రైతులు నమోదుకు మొగ్గు చూపుతున్నారు. దానికి తోడు రైతులు ఏఈఓల వద్దనే కాకుండా మీసేవా కేంద్రం, సీఎస్‌సీ కేంద్రాల్లోనూ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తి చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ఈ విషయాన్ని రైతులకు తెలిపి తమ వివరాలను నమోదు చేసుకునేలా వ్యవసాయశాఖ అధికారులు గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 30వ తేదీ నాటికి రైతులందరికీ ఫార్మర్‌ రిజిస్ట్రీ పూర్తి చేసేలా ప్రణాళికను రూపొందించారు.

30తో ముగియనున్న ఫార్మర్‌ రిజిస్ట్రీ

ఫ జిల్లాలో ఇప్పటి వరకు

77శాతం నమోదు

ఫ గ్రామాల్లో ప్రత్యేక సదస్సుల ద్వారా

రైతులకు అవగాహన

జిల్లాలో ఫార్మర్‌ రిజిస్ట్రీ ప్రక్రియ 77 శాతం పూర్తయ్యింది. 100 శాతం పూర్తయ్యేలా ఈ నెల 22 నుంచి 30 వరకు ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తున్నాం. రైతులు తప్పనిసరిగా తమ వివరాలు నమోదు చేసుకోవాలి. లేదంటే రానున్న రోజుల్లో ఎరువుల కొనుగోలుతోపాటు పంటల విక్రయానికి ఇబ్బందులు పడాల్సి వస్తుంది. తప్పనిసరిగా తమ ఫార్మర్‌ రిజిస్ట్రీని పూర్తి చేసుకోవాలి.

శ్రీధర్‌రెడ్డి జిల్లా వ్యవసాయశాఖ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement