పెన్‌పహాడ్ : మండలంలోని పలు గ్రామాల్లో నీరులేక ఎండిన పంటలను విద్యుత్ ఎస్‌ఈ యాదగిరి బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నూర్జహాన్‌పేట, గాజులమల్కాపురం గ్రామాల్లోని పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. వ్యవసాయానికి విద్యుత్ సరఫరాను 10 గంటల నుంచి 12గంటలకు పెంచాలని రైతులు అధికారిని కోరారు. ఉన్నతాధికారులకు నివేదిక అందించి విద్యుత్ సరఫరాపై తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆయన వెంట డీఈ వెంకట కిష్టయ్య, ఏడీఈ రాములు, ఏఈ శ్రీనివాస్ ఉన్నారు.


