నీళ్లేవి గణపయ్య.. | - | Sakshi
Sakshi News home page

నీళ్లేవి గణపయ్య..

Sep 23 2026 2:06 AM | Updated on Sep 23 2026 2:06 AM

నీళ్లేవి గణపయ్య..

ఫఒట్టిపోయిన చెరువులు, కుంటలు

సూర్యాపేట : భక్తుల విజ్ఞాలను తొలగించే విఘ్నేశ్వరుడి నిమజ్జనానికి నీటి కొరత ఏర్పడుతోంది. తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో పూజించిన బొజ్జ గణపయ్యను గంగమ్మ దరికి చేర్చేందుకు ఉత్సవ కమిటీలకు తిప్పలు తప్పడం లేదు. ఈ నెల 14న వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించగా ఐదవ రోజు నుంచే నిమజ్జన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. బుధవారం జిల్లా అంతటా నిమజ్జనం చేపట్టనున్నారు. సూర్యాపేట జిల్లాలో 3,150 విగ్రహాలను ఉత్సవ కమిటీలు నెలకొల్పాయి.

సూర్యాపేట జిల్లా కేంద్రంలోనే 300 విగ్రహాల వరకు నెలకొల్పారు. దాంతో పాటు ఒక్కో గ్రామంలో 15 నుంచి 20 చొప్పున మండలానికి 200 వరకు విగ్రహాలు నెలకొల్పారు. వీటిని బుధవారం నిమజ్జనం చేయనున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో సద్దలచెరువు వద్ద నిమజ్జనానికి ఇబ్బందులు లేకపోగా మిగతా చోట్ల నీటి సమస్య తీవ్రంగా ఉంది. ఎల్‌నినో కారణంగా వర్షాకాలం సీజన్లో తీవ్ర లోటు వర్షపాతం నమోదవగా గ్రామాల్లోని చెరువుల్లోకి నీరు చేరిన దాఖలాలు లేవు. ఇటీవల కురిసిన అడపాదడప వర్షాలకు కొన్ని ప్రాంతాలు కొద్ది మేర నీరు చేరినప్పటికీ పెద్ద విగ్రహాలు మునిగే పరిస్థితి లేదు. దాంతో స్థానికంగా నిమజ్జనం చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఈ క్రమంలో ఉత్సవ కమిటీలు పెద్ద విగ్రహాలను దూర ప్రాంతాలకు తీసుకు వెళ్లక తప్పని పరిస్థితి నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement