సూర్యాపేట : జాతీయ రహదారికి సమాంతంగా బుల్లెట్ ట్రైన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పెద్దిరెడ్డి రాజా పిలుపునిచ్చారు. బుల్లెట్ ట్రైన్ సాధన కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు మంగళవారం 40వ రోజు కొనసాగాయి. దీక్షలో సామాజికవేత్తలు పాల్గొనగా వారికి సంఘీభావం తెలిపి మాట్లాడారు. జిల్లా కేంద్రంలో జరుగుతున్న రిలే దీక్షల్లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు ఉద్యమాన్ని విరమించే ప్రసక్తే లేదన్నారు. దీక్షలో ధర్మార్జున్, వెలుగు వనిత, బూర వెంకటేశ్వర్లు, కందుకూరి యాదగిరి, సట్టు నాగయ్య, యార్కచర్ల శోభారాణి, ఖాసీం, నల్లగొండ నాగయ్య, గుంటి శ్రీనివాస్, వాసుదేవరావు, నాగవెల్లి కరుణాకర్, గుంటి కీర్తన కూర్చున్నారు. దీక్షలకు సూర్యాపేటకు చెందిన పాస్టర్లు జాన్ మార్క్, గోవర్ధన్, సామెల్ కిరణ్, బాబురావు, కరుణాకర్, డేవిడ్ రాజు, సాల్మన్ నాయక్, ఎజ్రా, జాక్సన్, ఏసు పాదం తదితరులు సంఘీభావం తెలిపారు.


