సూర్యాపేటటౌన్ : రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పీఆర్‌సీని ప్రకటించి జూలై 2023 నుంచి అమలు చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎన్. సోమయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సంఘం కార్యాలయంలో నిర్వహించిన జిల్లా ఆఫీసు బేరర్స్ సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టీజీఈ జేఏసీ నాయకులతో జరిపిన చర్చలలో ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న డీఏలను ప్రకటించాలని, సప్లిమెంటరీ బిల్స్, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షనరీ బెనిఫిట్స్‌ను కూడా క్లియర్ చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. అనిల్‌కుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు కె. అరుణ భారతి, జిల్లా కోశాధికారి జి. వెంకటయ్య, జిల్లా కార్యదర్శులు ఆర్. దామోదర్, ఎన్.నాగేశ్వరరావు, వెలుగు రమేష్, చిలక రమేష్, డి.లాలు, జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ సాంబయ్య, సభ్యులు శ్రీనివాసచారి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.


