సూర్యాపేటటౌన్ : జిల్లా పోలీసు కార్యాలయ ప్రాంగణం సరికొత్త రూపు సంతరించుకుంది. ఎస్పీ నరసింహ చొరవతో పలు మౌలిక వసతులు ఏర్పాటు చేశారు. పరిపాలనా కేంద్రంగానే కాకుండా, సిబ్బంది అవసరాలు, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చారు.
ఆకర్షణీయమైన పరేడ్ గ్రౌండ్
గతంలో ఉన్న ఇబ్బందులను తొలగిస్తూ.. కార్యాలయ ఆవరణలోని మైదానాన్ని సుమారు ఐదు అడుగుల మేర మట్టితో ఎత్తు పెంచి చదును చేశారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు, ఇతర అధికారిక కార్యక్రమాల నిర్వహణ కోసం శాశ్వత వేదికను నిర్మించారు.
జిమ్, షటిల్ కోర్టు ఏర్పాటు
పోలీసు సిబ్బంది శారీరక దారుఢ్యం, మానసిక ఉల్లాసం కోసం కార్యాలయ ప్రాంగణంలోనే అత్యాధునిక జిమ్‌తో పాటు ప్రత్యేక షటిల్ కోర్టు ఏర్పాటు చేశారు.
ప్రత్యేక క్యాంటిన్
సిబ్బంది నిత్యావసర సరుకులు, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు తక్కువ ధరలకే లభించేలా ‘కాప్ స్మార్ట్’ భవనాన్ని పూర్తి చేసి వినియోగంలోకి తెచ్చారు. ఈ క్యాంటిన్ ద్వారా బయటి మార్కెట్‌తో పోలిస్తే ప్రతి సిబ్బందికి నెలకు సుమారు రూ. 5,000 వరకు ఆదా అయ్యే అవకాశం ఉంది.
నిత్యావసరాల కోసం ఏర్పాటు చేసిన క్యాంటిన్
మెరుగైన మౌలిక వసతులు
కార్యాలయ ప్రధాన ద్వారం వద్ద ఆకర్షణీయమైన ఆర్చి, సరికొత్త గేటు ఏర్పాటు చేశారు. భద్రత కోసం కాంపౌండ్ వాల్, ఫెన్సింగ్‌తో పాటు ప్రాంగణం అంతటా పచ్చదనం పెంపొందించి ఆహ్లాదకర వాతావరణాన్ని తీర్చిదిద్దారు. వాహనాల పార్కింగ్ కొరకు ప్రత్యేకంగా షెడ్ల నిర్మాణం చేపట్టారు. ఎస్పీ నరసింహ తీసుకున్న ఈ ప్రత్యేక చొరవతో జిల్లా పోలీసు కార్యాలయ స్వరూపమే మారిపోయిందని సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఫ సిబ్బందికి వసతులు
ఫ ఎస్పీ నరసింహ చొరవతో
రూపుదిద్దుకున్న సౌకర్యాలు


