బుకింగ్‌ లేకుండానే యూరియా విక్రయం! | - | Sakshi
Sakshi News home page

బుకింగ్‌ లేకుండానే యూరియా విక్రయం!

Aug 13 2026 1:57 AM | Updated on Aug 13 2026 1:57 AM

ఖమ్మం జిల్లాకు తరలించడంతో

ఆగ్రహించిన రైతులు

కోదాడరూరల్‌ : కొందరు డీలర్లు యూరియా ను దళారులకు బ్లాక్‌లో ఎక్కువ రేటుకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కోదాడ పట్టణ పరిధిలోని తమ్మరలో నడిగూడెం మండల కేంద్రానికి చెందిన యాదగిరిలక్ష్మి నరసింహ ఫర్జిలైజర్‌ షాప్‌ యజమాని యాదగిరి ఎరువు గోడౌన్‌ను ఏర్పాటు చేసి స్టాక్‌ పాయింట్‌ పెట్టుకున్నాడు. అక్కడికి వందల బస్తాల యూరియాను దిగుమతి చేసుకున్నాడు. ఈక్రమంలో మంగళవారం రాత్రి అక్కడి నుంచి ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కొంగర గ్రామానికి చెందిన దళారులు, రైతులకు ఎలాంటి బుకింగ్‌ లేకుండానే వంద బస్తాలకు పైగా యూరియాను అక్రమంగా విక్రయించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక రైతులు సూర్యాపేట జిల్లాకు కేటాయించిన యూరియాను స్థానికంగా ఇవ్వకుండా ఖమ్మం జిల్లాకు చెందిన వారికి ఎలా విక్రయిస్తారని ప్రశ్నించారు. ఈవిషయంపై బుధవారం వ్యవసాయాధికారులకు సమాచారం ఇచ్చారు. వారు స్టాక్‌ పాయింట్‌ను పరిశీలించి యారియా బుకింగ్‌ లేకుండా విక్రయించారని గుర్తించారు. ఈమేరకు గోడౌన్‌ నిర్వాహకులపై పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఏఓ రజిని తెలిపారు.

వైభవంగా లక్ష్మీనృసింహుడి

నిత్యకల్యాణం

మఠంపల్లి: మట్టపల్లి దేవాలయంలో లక్ష్మీనృసింహుడి నిత్యకల్యాణాన్ని అర్చకులు బుధవారం వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవతో ప్రత్యేక పూజ కార్యక్రమాలు ప్రారంభించారు. అనంతరం హోమశాలలో నిత్యాగ్నిహోత్రి చేపట్టారు. గర్భాలయంలో లక్ష్మీనారసింహుడి మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం జరిపించారు. నిత్యకల్యాణంలో భాగంగా ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం చేపట్టారు. అదేవిధంగా విష్వక్సేనపూజ, రుత్విగ్వరణం, రక్షాబంధనం, మధుఫర్కపూజ, మాంగల్యధారణ పూర్తిగావించారు. భక్తులకు మహానివేదనతో తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్‌, ఈఓ చలపతిరావు, అర్చకులు కృష్ణమాచార్యులు, పద్మనాభా చార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు పాల్గొన్నారు.

దేశాభివృద్ధిలో

భాగస్వాములు కావాలి

నల్లగొండ టూటౌన్‌ : యువ ఇంజనీర్లు దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ఖాజా అల్తాఫ్‌ హుస్సేన్‌ అన్నారు. ఎంజీ యూనివర్సిటీలో బుధవారం ఇంజనీరింగ్‌ కళాశాల నిర్వహించిన ఓరియంటేషన్‌ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశం సేవారంగం నుంచి ఉత్పత్తి ఎకనామీగా రూపాంతరం చెందడానికి యువ ఇంజనీర్ల సేవలు ఎంతో అవసరమన్నారు. ఈ సందర్భంగా అధ్యాపకులు.. కోర్సులు, నైపుణ్యాల వృద్ధి, పరీక్షల నిర్వహణ, స్పోర్ట్స్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. రిజిస్ట్రార్‌ కొప్పుల అంజిరెడ్డి, ప్రిన్సిపాల్‌ హరీష్‌కుమార్‌, అధ్యాపకులు సంధ్యారాణి, సుధారాణి, జయంతి, ప్రొఫెసర్‌ సాంబశివరావు, రఘుమారావు, విజయ్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

యువత దేశ చరిత్రను అధ్యయనం చేయాలి

చౌటుప్పల్‌ : యువత దేశ చరిత్రను అధ్యయనం చేయాలని ఆర్‌ఎస్‌ఎస్‌ తెలంగాణ ప్రాంత సహ ప్రచారక్‌ కల్పగురు ప్రభాకర్‌జీ అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని బుధవారం చౌటుప్పల్‌ పట్టణంలో యువ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో విభాగ్‌ సహకార్య వాహ తాడెం పాండుజీ, కె.కృష్ణయ్యజీ, ఏబీవీపీ నల్లగొండ జిల్లా కన్వీనర్‌ సుర్వి మణికంఠ, యాదాద్రి జిల్లా కన్వీనర్‌ ఉబ్బు సాయికిరణ్‌, ప్రచార ప్రతినిధి నారి మధు, ఆర్‌ఎస్‌ఎస్‌ చౌటుప్పల్‌ ఖండ మహిపాల్‌రెడ్డి, కార్యవాహ శ్రీరాములు, సహ కార్యవాహ రేణుకుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement